AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. గౌరవం, ప్రేమలో భారీ లాభాలు!

Venus Transit 2026: జూన్ 11 నుంచి పుష్య నక్షత్రంలోకి ప్రవేశించిన శుక్రుడు నాలుగు రాశుల వారికి ప్రత్యేక శుభఫలితాలను అందించనున్నాడు. వృషభం, కర్కాటకం, తులా, మీన రాశుల వారికి ధనలాభాలు, గౌరవం, వృత్తిలో పురోగతి, ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

Rajashekher G
|

Updated on: Jun 11, 2026 | 8:17 PM

Share
జ్యోతిష్య పరంగా జూన్ 11, 2026న అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు అధిక మాస పరమ ఏకాదశి సందర్భంగా, ఐశ్వర్యం, సౌందర్యం, సుఖసంతోషాలకు కారకుడైన శుక్రుడు శుభప్రదమైన పుష్య నక్షత్రంలోకి ప్రవేశించాడు. సంపద, గౌరవం, అదృష్టాన్ని ప్రసాదించే పుష్య నక్షత్రంలో శుక్రుడి సంచారం ప్రత్యేక ఫలితాలను ఇవ్వనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పుష్య నక్షత్రానికి అధిపతి శని. శని, శుక్రులు మిత్ర గ్రహాలు కావడంతో ఈ సంచారం మరింత శుభప్రదంగా మారింది. శుక్రుడు జూన్ 11 నుంచి జూన్ 22, 2026 వరకు పుష్య నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

1 / 6
1. వృషభ రాశి: వ్యక్తిత్వానికి ప్రత్యేక ఆకర్షణ.. 
వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ సంచారం వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారి, చుట్టుపక్కల వారిపై మంచి ప్రభావం చూపగలుగుతారు.  ఆత్మవిశ్వాసం పెరిగి, కీలక నిర్ణయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపించడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

1. వృషభ రాశి: వ్యక్తిత్వానికి ప్రత్యేక ఆకర్షణ.. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ సంచారం వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారి, చుట్టుపక్కల వారిపై మంచి ప్రభావం చూపగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరిగి, కీలక నిర్ణయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపించడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

2 / 6
2. కర్కాటక రాశి: ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతాయి..  
కర్కాటక రాశి వారికి శుక్రుడి ఈ సంచారం మంచి గుర్తింపు,  గౌరవాన్ని తీసుకురాగలదు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు విజయవంతమయ్యే అవకాశముంది. కుటుంబ, దాంపత్య సంబంధాలు మరింత బలపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందించేలా ఉంటాయి. సమాజంలో మీ స్థానం కూడా మెరుగుపడుతుంది.

2. కర్కాటక రాశి: ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతాయి.. కర్కాటక రాశి వారికి శుక్రుడి ఈ సంచారం మంచి గుర్తింపు, గౌరవాన్ని తీసుకురాగలదు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు విజయవంతమయ్యే అవకాశముంది. కుటుంబ, దాంపత్య సంబంధాలు మరింత బలపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందించేలా ఉంటాయి. సమాజంలో మీ స్థానం కూడా మెరుగుపడుతుంది.

3 / 6

3. తులా రాశి: ధన ప్రవాహం పెరుగుతుంది..  
తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి. అందువల్ల ఈ కాలంలో ఆర్థిక లాభాల అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. నిలిచిపోయిన బకాయిలు లేదా రావలసిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. కళలు, సృజనాత్మక రంగాలు, మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక అవకాశాలు లభించవచ్చు. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

3. తులా రాశి: ధన ప్రవాహం పెరుగుతుంది.. తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి. అందువల్ల ఈ కాలంలో ఆర్థిక లాభాల అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. నిలిచిపోయిన బకాయిలు లేదా రావలసిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. కళలు, సృజనాత్మక రంగాలు, మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక అవకాశాలు లభించవచ్చు. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

4 / 6
4. మీన రాశి: హోదా, సంపద, ప్రేమలో సానుకూల మార్పులు.. 
మీన రాశి వారికి శుక్రుడి పుష్య నక్షత్ర ప్రవేశం అనేక శుభఫలితాలను అందించవచ్చు. ఆర్థికంగా లాభాలు పెరిగి, గతంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో లేదా సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఆనందకరమైన పరిణామాలు చోటుచేసుకుని, సంబంధాలు మరింత బలపడతాయి.

4. మీన రాశి: హోదా, సంపద, ప్రేమలో సానుకూల మార్పులు.. మీన రాశి వారికి శుక్రుడి పుష్య నక్షత్ర ప్రవేశం అనేక శుభఫలితాలను అందించవచ్చు. ఆర్థికంగా లాభాలు పెరిగి, గతంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో లేదా సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఆనందకరమైన పరిణామాలు చోటుచేసుకుని, సంబంధాలు మరింత బలపడతాయి.

5 / 6
శుక్రుడి అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు.. 
శుక్రవారం ఉపవాసం పాటించడం శుభప్రదంగా భావిస్తారు. మహాలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. పాయసం, పాలు లేదా చక్కెరతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. శుక్ర గ్రహ అనుగ్రహం కోసం "ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః" మంత్రాన్ని జపించవచ్చు. లేదా "ఓం శుం శుక్రాయ నమః" అనే ఏకాక్షర బీజ మంత్రాన్ని భక్తితో జపించడం కూడా శుభఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

శుక్రుడి అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు.. శుక్రవారం ఉపవాసం పాటించడం శుభప్రదంగా భావిస్తారు. మహాలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. పాయసం, పాలు లేదా చక్కెరతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. శుక్ర గ్రహ అనుగ్రహం కోసం "ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః" మంత్రాన్ని జపించవచ్చు. లేదా "ఓం శుం శుక్రాయ నమః" అనే ఏకాక్షర బీజ మంత్రాన్ని భక్తితో జపించడం కూడా శుభఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

6 / 6
Follow Us
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. గౌరవ
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. గౌరవ
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..