- Telugu News Photo Gallery Best and Super Health Benefits of Halim Seeds, check here is details in Telugu
Halim Seeds: హలీం గింజల గురించి తెలుసా? ఇవి తింటే చర్మం, జుట్టు మెరిసిపోతాయి..
హలీం గింజలు అనగానే చాలా మందికి హలీమ్ గుర్తొచ్చే ఉంటుంది. కానీ ఈ గింజలు వేరు. వీటికి వంటకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. వీటిని ఆలివ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. హలీం గింజల్లో ఎన్నో పోషక విలువలు, శక్తి వంతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవిసె గింజలు, నువ్వులు, బాదం ఇలా ఇతర నట్స్‌లాగే ఇవి కూడా అంతే. అనేక ఔషధాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. హలీం గింజలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు..
Updated on: Feb 02, 2024 | 2:34 PM

హలీం గింజలు అనగానే చాలా మందికి హలీమ్ గుర్తొచ్చే ఉంటుంది. కానీ ఈ గింజలు వేరు. వీటికి వంటకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. వీటిని ఆలివ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. హలీం గింజల్లో ఎన్నో పోషక విలువలు, శక్తి వంతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవిసె గింజలు, నువ్వులు, బాదం ఇలా ఇతర నట్స్‌లాగే ఇవి కూడా అంతే. అనేక ఔషధాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు.

హలీం గింజలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా మెరుగు పరుస్తాయి. శ్వాస కోశ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అలసట, జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా అదుపులోకి తీసుకు రావచ్చు.

ఆయుర్వేదంలో అయితే హలీం గింజల్ని.. జుట్టు రాలడాన్ని నివారించే మందుల్లో ఉపయోగిస్తున్నారు. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, మెదడు పనితీరు సక్రమంగా ఉండేందుకు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం.

రక్త హీనత సమస్య ఉన్నవారు వీటిని తింటే.. ఈ సమస్య కంట్రోల్ అవుతుంది. ఇందులో ఐరన్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా హలీం గింజల్లో లైసెన్ అని ఉంటుంది. ఇది కణజాలాలు ఆరోగ్యంగా ఉండేందుకు, కణజాలాలను మరమ్మత్తు చేస్తుంది.

ముఖ్యంగా ఇందులో విటమిన్లు ఎ, ఇలు ఉంటాయి. ఈ హలీం గింజల్ని తింటే చర్మం కాంతి వంతంగా మెరిసి పోయేలా చేస్తాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడని తగ్గిస్తాయి. కాబట్టి జుట్టు, చర్మం అందంగా ఉంటాయి.





























