- Telugu News Photo Gallery Beneficial Effects Of Green Tea Know Here All Details In Telugu Lifestyle News
Green Tea: అన్ని రోగాలకి ఒక్కటే పరిష్కారం.. ప్రతిరోజూ మూడు కప్పుల గ్రీన్ టీ తాగండి చాలు..
గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే శక్తివంతమైన పానీయం. గ్రీన్ టీలో ముఖ్యంగా పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కానీ, గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాము.
Updated on: Jun 06, 2025 | 11:31 AM

గ్రీన్ టీ వల్ల కలిగే ఎక్కువగా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్లే వస్తాయి. ఇవి మీ బాడీని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు, రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది. గ్రీన్ టీ కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.

Green Tea

గ్రీన్ టీలో ఎల్ థయమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఆందోళన తగ్గుతుంది. గ్రీన్ టీ తాగితే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల న్యూరోడీజెనరేటివ్ సమస్యలు రావు. అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఎముకలను బలంగా మార్చడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీ తాగితే ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది. కీళ్ల నొప్పులు మాయం అవుతాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫినాల్స్ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి.

గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గ్రీన్ టీలోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

గ్రీన్ టీ తాగడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. గ్రీన్‌టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా ఉంచుతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల వేగంగా, సులభంగా బరువు తగ్గొచ్చు. గ్రీన్‌టీలోని కెటాచిన్లు చెడు కొవ్వును కరిగిస్తాయి. గ్రీన్ టీ తాగితే కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. గ్రీన్ టీ తాగితే రక్తప్రసరణ బాగా అవుతుంది. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది.




