- Telugu News Photo Gallery Are these two phones under Rs 15,000 Know the main differences samsung galaxy A14 Vs redmi Note 12
A14 Vs Note-12: రూ.15,000 లోపు వచ్చే ఈ రెండు ఫోన్స్‌లో ఇన్ని తేడాలు ఉన్నాయా? అవేంటో తెలుసుకోండి
సాధారణంగా మనం ఏ ఫోన్ కొందామన్నా అదే ధరకు కొంచెం అటుఇటుగా ఏ ఫోన్ ఉందో? తెలుసుకుంటాం. అలాగే ఫీచర్లపరంగా ఏం తేడాలు ఉన్నాయో? తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటాం. ఏ ఫోన్ అయినా మనకు వచ్చే ధరలో ప్రీమియం ఫీచర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఇటీవల కాలంలో రూ.15,000 లోపు వచ్చే రెండు ఫోన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 అలాగే రెడ్ మీ నోట్ 12 ఫోన్లు ఇంచుమించు ఒకే ధరకు వస్తున్నాయి. అయితే ఆ రెండు ఫోన్ల మధ్య తేడాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
Srinu |
Updated on: May 30, 2023 | 12:55 PM

సామ్‌సంగ్ ఏ 14 ధర రూ.13,999గా ఉంటే రెడ్ మీ నోట్ 12 ఫోన్ ధర రూ.14,999గా ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 6.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అయితే రెడ్ మీ నోట్ 12 ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తే రెడ్ మీ నోట్ 12 ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ గిరిల్లా గ్లాస్ 3 రక్షణతో సున్నితమైన విజువల్స్, మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 ఎక్సినోస్ 850 చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. రెడ్ మీ నోట్ 12 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో వస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 4 జీబీ+64 జీబీ, 4 జీబీ+ 128 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉండగా రెడ్ మీ నోట్ 12 6 జీబీ+ 64 జీబీ, 6 జీబీ+ 128 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 50 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్‌తో వస్తుంటే రెడ్ మీ నోట్ 12 ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్‌తో ఆకర్షణీయంగా ఉంది. అలాగే ముందు వైపు రెండు ఫోన్ 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్ మీ నోట్ 12 55 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి.





























