- Telugu News Photo Gallery Applying this oil is sure to produce hair even on bald areas, Check Here is Details
Hair Growth Oil: ఈ నూనె రాశారంటే బట్టతలపై కూడా జుట్టు రావడం ఖాయం..
ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టుకు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలిపోయి బట్టతల వచ్చేస్తున్నాయి. దీని వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ ఆ ఆయిల్ వాడితే బట్టతల మీద కూడా జుట్టును తీసుకు రావచ్చు..
Updated on: Nov 30, 2024 | 5:43 PM

ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు కూడా ఒకటి. జుట్టు విపరీతంగా రాలిపోవడం, చుండ్రు, జుట్టు పెరగక పోవడం కారణంగా చాలా మందికి బట్ట తల కూడా వచ్చేస్తుంది. దీంతో అందరూ హేళన చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఆయిల్ ట్రై చేస్తే ఖచ్చితంగా జుట్టు వస్తుంది.

జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను కంట్రోల్ చేయడంలో రోజ్మేరీ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఎదుగుదలలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

రోజ్మేరీ ఆయిల్ వాడటం వల్ల బట్టతలపై కూడా ఖచ్చితంగా జుట్టు అనేది వస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది. కుదుళ్లు అనేవి బలంగా, దృఢంగా తయారవుతాయి. జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.

రోజ్మేరీ ఆయిల్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రోజ్మేరీ ఆయిల్ మీరు బయటనే కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ జుట్టుకు పోషణ అందించి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఈ నూనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై ఏర్పడే ఫంగస్, బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. కాబట్టి చుండ్రు సమస్య ఉన్నా కూడా తగ్గుతుంది. ఈ ఆయిల్‌ని ఇంట్లో చేసుకుంటేనే తక్కువ ధరలో పూర్తి అవుతుంది.




