Almond Milk: అమేజింగ్.. డైలీ బాదం పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..?
బాదం పాలలో పోషకాలు ఎక్కువగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంట్లో లాక్టోస్ ఉండదు. ఇది ఆవు పాలకి మంచి ప్రత్యామ్నాయం. ఇది ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ E సమృద్ధిగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం వల్ల కలిగి లాభాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Aug 29, 2025 | 1:01 PM

బాదం పాలు కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు.. అది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. బాదం పప్పులో ఉండే విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు నేరుగా బాదం పప్పును తినడం కంటే, బాదం పాలుగా తీసుకుంటే శరీరానికి మరింత సులభంగా అందుతాయి.

జీర్ణక్రియ : బాదం పాలలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం బాదం పాలలో పుష్కలంగా లభిస్తుంది. ఇవి ఎముకలను ధృడంగ మారుస్తుంది.

మెదడు ఆరోగ్యం: బాదం పాలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

మధుమేహ నియంత్రణ: బాదం పాలు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల బాదం పాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బరువు తగ్గడానికి: ఒక కప్పు బాదం పాలలో కేవలం 39 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది ఆకలిని తగ్గించి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా రోజూ బాదం పాలు తాగడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.




