దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక. దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చురుగ్గా ఉంటుంది హారిక. తాజా తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ.