ఆధునిక యుగంలో ఆదివాసీల దుస్థితి.. ప్రాణాలు డోలిలో మోసుకెళ్లిన గ్రామస్థులు..
ఏజెన్సీలోని మారుమూల ప్రాంతంలో అడవి బిడ్డలకు డోలిమోతలు తప్పడం లేదు. గర్భిణులు, రోగులకు అత్యవసరమైనప్పుడు వెళ్లాలంటే రహదారి లేక వాహనాలు రాక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అనారోగ్య బారినపడ్డ ఆదివాసి మహిళలకు ఆరు కిలోమీటర్ల మేర డోలిమోసారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయితీ జాజులు బంధ. కొండ శిఖర గ్రామంలో 29 కుటుంబాల్లో 140 మంది జనాభా నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే సరైన రహదారి లేదు.