- Telugu News Photo Gallery Adding these while cooking ghee is healthy as well as tasty, check here is Details
Kitchen Hacks: నెయ్యి కాచేటప్పుడు వీటిని కలిపితే ఆరోగ్యంతో పాటు రుచి కూడా..
నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. నెయ్యి తినడం వల్ల చర్మం, జుట్టు, కండరాలు, ఎముకలు, జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. నెయ్యి తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. మితంగా తీసుకుంటే ఏదైనా అమృతమే. ఇది నెయ్యికి కూడా వర్తిస్తుంది. చాలా మంది ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. బయట అమ్మే వాటిల్లో ఏం వేసి తయారు చేస్తారో ఏమో అని చాలా మంది ఇంట్లోనే..
Updated on: Sep 06, 2024 | 5:17 PM

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. నెయ్యి తినడం వల్ల చర్మం, జుట్టు, కండరాలు, ఎముకలు, జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. నెయ్యి తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. మితంగా తీసుకుంటే ఏదైనా అమృతమే. ఇది నెయ్యికి కూడా వర్తిస్తుంది.

చాలా మంది ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. బయట అమ్మే వాటిల్లో ఏం వేసి తయారు చేస్తారో ఏమో అని చాలా మంది ఇంట్లోనే స్వచ్ఛంగా నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. ఇంట్లో నెయ్యిని తయారు చేసేటప్పుడే ఘమఘమలాడే సువాసన వస్తుంది.

మరి ఈ నెయ్యిని కాచేటప్పుడు కొన్ని రకాల పదార్థాలు కలిపితే మరింత రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. గార్లిక్ బటర్ రుచి రావాలంటే.. నెయ్యిని కాచేటప్పుడు.. పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వెల్లుల్లిని వేయండి. వెల్లుల్లి వల్ల అధిక రక్త పోటు సమస్య తగ్గుతుంది. ఇన్ ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది.

నెయ్యిని కాచేటప్పుడు మునగాకు వేయడం వల్ల చాలా మంచిది. నెయ్యి కాచడం అయిపోయాక స్టవ్ కట్టేసి మునగాకు కాండంతో సహా వేయండి. అలాగే పసుపు, మిరియాలు కూడా కలపొచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి, కిడ్నీల ఆరోగ్యానికి మంచిది. నెయ్యి కాచడం పూర్తయ్యాక కలపాలి.

తులసి ఆకు వేయడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి నుంచి వచ్చే వాసనను దూరం చేసి.. సువాసన వచ్చేలా చేస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అదే విధంగా మెంతులు కూడా వేయవచ్చు. నెయ్యి పూర్తి అయిపోయే ముందు మెంతులు వేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి వేడి చేయదు.




