- Telugu News Photo Gallery Cinema photos Actress Radhika Apte Recalls Being Treated Horribly Her First Film
Actress : డబ్బులివ్వలేదు.. దారుణంగా ట్రీట్ చేశారు.. మాతో భయంకరంగా ప్రవర్తించారు.. హీరోయిన్ కామెంట్స్..
సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న తారలు.. కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు భరించినవారే. ఇప్పుడు ఓ హీరోయిన్ సైతం తన మొదటి సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తమతో ఎంతో దారుణంగా ప్రవర్తించారని.. అందుకే ఆ సినిమాను తాను మర్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
Updated on: Dec 18, 2025 | 3:19 PM

సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ తో పనిలేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తాజాగా తన తొలి సినిమా గురించి మర్చిపోవాలనుకుంటున్నానని.. అది భయంకరమైన రోజులు అంటూ చెప్పుకొచ్చింది.

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో రాణిస్తుంది. 2005లో వాహ్ లైఫ్ ఓతో ఐసీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించింది.

తాజాగా తన తొలి చిత్రం రోజులను గుర్తుచేసుకుంది. తన మొదటి సినిమా నిర్మాతలు తనకు డబ్బులు ఇవ్వలేదని అన్నారు. తన తల్లితో కలిసి ఒప్పందంపై సంతకం చేయమని అడిగినప్పుడు.. ఊర్మిళ మటోండ్కర్ వంటి స్టార్ హీరోయిన్ కూడా ఒప్పందం పై సైన్ చేయలేదని అన్నారని..

ఆమె సంతకం చేసిందో లేదో నాకు తెలియదు, కానీ వారు మాతో భయంకరంగా ప్రవర్తించారని అన్నారు. మహేష్ మంజ్రేకర్ గొప్ప వ్యక్తి. అందుకే నా సినిమాను మర్చిపోవడానికి ఇష్టపడతాను. ఆ టీంలో ఉన్న ఆయన నన్ను పిలిచి ఛాన్స్ ఇస్తానని అన్నారు అని గుర్తుచేసుకుంది.

మొదటి సినిమాలో నేను బ్రెయిన్ సర్జన్ అనే నాటకం వేస్తున్నాను. అది మంచి నాటకం. మేము రాష్ట్ర పోటీలో అవార్డు గెలుచుకున్నాము. మహేష్ మంజ్రేకర్ న్యాయనిర్ణేతలలో ఒకరు. నాటకం ముగిసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానని అన్నారు అంటూ చెప్పుకొచ్చింది.




