AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారానికి రెండు రోజులు వ్యాయామం చేసిన ఆరోగ్య ప్రయోజనాలు.. సర్వేలో బయటపడ్డ కీలక విషయాలు

వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతోమంచిదని మనందరికి తెలిసిందే. కానీ చాలామంది రోజూ చేసేందుకు బద్ధకం చూపిస్తుంటారు. రోజూ ఏం చేస్తాంలే అంటూ రెండు, మూడు రోజులు చేసి వదిలిస్తారు. ఈ నేపథ్యంలోని వ్యాయమంపై తాజాగా చేపట్టిన ఓ సర్వే గుడ్ న్యూస్ చెప్పింది.

Aravind B
|

Updated on: Jul 21, 2023 | 11:57 AM

Share
వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతోమంచిదని మనందరికి తెలిసిందే. కానీ చాలామంది రోజూ చేసేందుకు బద్ధకం చూపిస్తుంటారు. రోజూ ఏం చేస్తాంలే అంటూ రెండు, మూడు రోజులు చేసి వదిలిస్తారు. ఈ నేపథ్యంలోని వ్యాయమంపై తాజాగా చేపట్టిన ఓ సర్వే గుడ్ న్యూస్ చెప్పింది.

వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతోమంచిదని మనందరికి తెలిసిందే. కానీ చాలామంది రోజూ చేసేందుకు బద్ధకం చూపిస్తుంటారు. రోజూ ఏం చేస్తాంలే అంటూ రెండు, మూడు రోజులు చేసి వదిలిస్తారు. ఈ నేపథ్యంలోని వ్యాయమంపై తాజాగా చేపట్టిన ఓ సర్వే గుడ్ న్యూస్ చెప్పింది.

1 / 5
వారానికి కేవలం రెండు రోజులు వ్యాయామం చేసిన కూడా అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చని చెప్పింది. ఇలా రెండు రోజులు చేసినా గుండెపోటు, పక్షవాతం ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ వ్యాయమం సాధారణ స్థాయిలో మాత్రమే కాకుండా కాస్త ఎక్కువగా ఉండాలని తేల్చి చెప్పింది.

2 / 5
మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే ప్రతిఒక్కరు కూడా వారానికి కనీసం 150 నిమిషాల సాధారణం నుంచి తీవ్రస్థాయి వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే అమెరికా హర్ట్ అసోషియేషన్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

3 / 5
వాస్తవానికి వారం రోజులు సాధారణ స్థాయిలో వ్యాయామం చేయాలా లేదా తీవ్ర స్థాయిలో కొద్ది రోజులు చేసినా ప్రయోజనం ఉంటుందా అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టంత లేదు. అందుకోసమే ఈ విషయం గురించి తెలుసుకునేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయాన్ని నిర్వహిమచారు. 2013-2015 మధ్య సగటున 62 ఏళ్ల వయసున్న 90 వేల మంది నుంచి ఆక్సెలరోమీటర్ల ద్వారా డేటాను సేకరించారు. దీనిపైనే తాజాగా విశ్లేషనలు చేశారు.

4 / 5
ఇందులో తెలిసిందేంటంటే వారంలో కేవలం 1-2 రోజులు తీవ్రస్థాయిలో వ్యాయామం చేసిన ఆరోగ్యంపై ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు. గుండెపోటు, పక్షవాతంతో సహా  ఏట్రియల్‌ ఫైబ్రిలేషన్‌, మయోకార్డియల్‌ ఇన్‌ఫ్రాక్షన్‌ వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు కనిపెట్టారు.

5 / 5