AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Hill Stations: ఇన్‌స్టాలో 5 హిల్ స్టేషన్లు హల్చల్.. ఢిల్లీ చేరువలో స్వర్గధామాలు..

ఢిల్లీలో ప్రయాణ ప్రియులు ఎల్లప్పుడూ చల్లని ప్రదేశాల కోసం వెతుకుతారు. 2025లో ఐదు హిల్ స్టేషన్లు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లను బాగా ఫేమస్ అయ్యాయి. స్వచ్ఛమైన గాలి పర్వత దృశ్యాలు, ప్రశాంతమైన బస కారణంగా ప్రజలు ఈ ప్రదేశాలను పర్యాటకులు ఇష్టపడుతున్నారు. మరి ఆ ప్రదేశాలు ఏంటి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం రండి.. 

Prudvi Battula
|

Updated on: Jul 16, 2025 | 3:38 PM

Share
ముస్సూరీ: ముస్సూరీ ప్రశాంతమైన వాతావరణం, పచ్చని కొండలకు ప్రసిద్ధి చెందింది. ప్రజలు మాల్ రోడ్‌లో నడవడం, కెంప్టీ జలపాతం వద్ద ఫోటోలు తీయడం ఇష్టపడతారు. ఈ కొండ పట్టణం చేరుకోవడం చాలా సులభం. అలాగే చిన్న ప్రయాణాలకు సరైనది.

1 / 5
లాన్స్‌డౌన్: లాన్స్‌డౌన్ ఇప్పటికీ నిశ్శబ్దంగా, శుభ్రంగా ఉండటం వల్ల ప్రజాదరణ పొందుతోంది. ప్రకృతి ప్రేమికులు పైన్ అడవులలోని చిన్న కేఫ్‌లు, ప్రశాంతమైన బసల కోసం ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. తక్కువ రద్దీని కోరుకునే వారికి ఇది ఒక అగ్ర ఎంపిక.

2 / 5
 నైని సరస్సు: నైనిటాల్ దాని అందమైన సరస్సుకు ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు దగ్గర బోటింగ్, సాయంత్రం నడకలు, ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుండి సూర్యోదయం, సూర్యాస్తమయ ఛాయాచిత్రాలతో ఇన్‌స్టాగ్రామ్ నిండి ఉంది.

3 / 5
 కసౌలి: కసౌలి దాని పాత బ్రిటిష్ వైబ్ కారణంగా ట్రెండింగ్‌లో ఉంది. చిన్న వీధులు హాయిగా ఉండే హోమ్‌స్టేలు, పొగమంచుతో కూడిన ఉదయాలు ఎంతగానే ఆకట్టుకుంటాయి. ఢిల్లీ నుండి వారాంతపు విరామానికి ఇది మంచి ప్రదేశం.

4 / 5
 చైల్: చైల్ చల్లని వాతావరణం, తక్కువ రద్దీకి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానాన్ని కలిగి ఉంది. ఇది హిమాలయాల మధ్య దాగి ఉన్న ఓ భూతల స్వర్గం. ఇది కొండలు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. 

5 / 5