AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వైపు తగ్గింపు, మరో వైపు వడ్డింపు. కర్రు కాల్చకుండానే వాత. అగ్రిసెస్‌ పేరుతో బడ్జెట్‌లో ఈసారి బాగానే వడ్డించారు

ఏ యాంగిల్‌లో చూసినా సామాన్యుడికి ఊరట లేదు. ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నట్లే ఉంది కేంద్ర బడ్జెట్‌. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచింది. ఒకటీ అరా తప్పితే మిగిలినవన్నీ

ఓ వైపు తగ్గింపు, మరో వైపు వడ్డింపు. కర్రు కాల్చకుండానే వాత. అగ్రిసెస్‌ పేరుతో బడ్జెట్‌లో ఈసారి బాగానే వడ్డించారు
Venkata Narayana
|

Updated on: Feb 02, 2021 | 12:38 AM

Share

ఏ యాంగిల్‌లో చూసినా సామాన్యుడికి ఊరట లేదు. ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నట్లే ఉంది కేంద్ర బడ్జెట్‌. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచింది. ఒకటీ అరా తప్పితే మిగిలినవన్నీ షాకులే. అగ్రి అండ్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ సెస్‌ పేరుతో భారీగా వడ్డించారు. ఓవైపు గోల్డ్‌ సిల్వర్‌పై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తూనే మరోవైపు 2.5శాతం అగ్రిసెస్‌ వేశారు. ఇక ఆల్కహాల్‌పై వందశాతం సెస్‌, దీంతో బాటిల్‌పై ప్రతీ వందకు పదిరూపాయల ధర పెరగనుంది. ఇక క్రూడ్‌ పామాయిల్‌పై 17.5శాతం సెస్‌ విధించారు. క్రూడ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై 20శాతం సెస్‌ విధించడంతో… వంటనూనెల ధరలు సలసలా కాగబోతున్నాయి.

35శాతం సెస్‌తో ఇప్పటిదాకా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న కశ్మీర్‌, సిమ్లా యాపిల్స్‌ ధరలు మండిపోనున్నాయి. బొగ్గు, లిగ్నైట్‌, పీట్‌పై ఒకటిన్నర శాతం.. కొన్నిరకాల ఫెర్టిలైజర్లపై 5శాతం.. కాటన్‌పై 5శాతం సెస్‌ పడబోతోంది. ఇక బఠానీపై 40శాతం, పల్లీలపై 30శాతం, పప్పుదినుసులపై 50శాతం కస్టమ్స్‌ డ్యూటీ పడబోతోంది. అగ్రి సెస్‌ ఎలా విధించబోతున్నారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అగ్రిసెస్‌ పేరుతో పెట్రోల్‌ ధరలూ పెరగబోతున్నాయి. దీంతో సహజంగానే అన్నిరకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. అత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ సెస్‌ ద్వారా వ్యవసాయ, నిర్మాణ రంగానికి భారీగా నిధులు కేటాయించాలనుకుంటోంది కేంద్రం.

వ్యవసాయ ఉత్పత్తులకు MSPలను నిర్ణయించడం, ఇకపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం… అగ్రిసెస్‌ ప్రజలపై ఎలాంటి భారం మోపదంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రెండునెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సమయంలో..అగ్రిసెస్‌ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది కేంద్రం. రైతుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల నిల్వకు గోడౌన్ల ఏర్పాటు, వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరణకు అగ్రిసెస్‌ ఆదాయాన్ని వినియోగించబోతున్నారు. అగ్రికల్చరల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ ద్వారా ఏడాదికి 30వేలకోట్ల ఆదాయాన్ని అంచనావేస్తోంది కేంద్ర ఆర్థికశాఖ. సగటు పౌరుడిపై భారం పడకుండా ఈ సెస్‌ రూపొందించామంటున్నా…అమలులోకి వచ్చాకగానీ దాని సెగ తగిలేలా లేదు.