అక్టోబర్ తరువాత ఐపీవోకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్

భారతదేశపు ప్రభుత్వరంగ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఈ ఏడాది అక్టోబర్ తరువాత ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు వచ్చే అవకాశం ఉంది. వచ్చే..

అక్టోబర్ తరువాత ఐపీవోకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్
Follow us

|

Updated on: Feb 03, 2021 | 12:29 AM

భారతదేశపు ప్రభుత్వరంగ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఈ ఏడాది అక్టోబర్ తరువాత ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలోనే ఎల్ఐసీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారి స్పష్టం చేశారు. 2020-21కిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఐపీవో ద్వారా ఎల్‌ఐసీలో వాటాలను విక్రయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. లిస్టింగ్‌కు సంబంధించి స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మార్గదర్శకాలను అనుసరిస్తామని, ఇందుకోసం చట్టసవరణ అవసరమవుతుందని, దీనికి సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డిపామ్) కార్యదర్శి తుహిన్ కాంతా పాండే చెప్పారు.

ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తుహిన్ కాంతా పాండే సమాధానాలిచ్చారు. ఎల్ఐసీ షేర్ స్టాక్ లిస్టింగ్‌ అయ్యేది మాత్రం ఈ ఏడాది అక్టోబర్ తర్వాతనే జరుగుతుందని ఆయన తెలిపారు. ఎల్‌ఐసీలో వాటా విక్రయం అంతా పారదర్శకంగా జరుగనున్నదని, ప్రతి ఒక్కరు కొనుగోలు చేసే విధంగా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు పాండే వెల్లడించారు. ఎల్‌ఐసీలో ఎంతమేర వాటా విక్రయిస్తారు అని అడిగిన ప్రశ్నకు పాండే సమాధానమిస్తూ… పది శాతం ఉంటుందని అనుకుంటానని, ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు.

ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.90 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఐడీబీఐ బ్యాంకుతోపాటు ఇతర సంస్థల్లో వాటాలను అమ్మడం ద్వారా రూ.2.10 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండగా, అదే ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటా ఉంది. 60 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఎల్‌ఐసీకి బీమా రంగంలో 70 శాతానికి పైగా వాటా కలిగి ఉంది. పాలసీల విక్రయాల్లో 76.28 శాతం, తొలి ఏడాది ప్రీమియం వసూళ్లలో 71 శాతం వాటా ఉంది.

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!