Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhupendra Patel: అన్నీ చిన్నాచితకా పదవులే.. ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సరాసరి సీఎం పదవితో భూపేంద్ర పటేల్‌ జాక్‌పాట్‌

చాలా చిన్నపదవులను మాత్రమే నిర్వహించిన అనుభవం భూపేంద్ర పటేల్‌కు ఉంది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా

Bhupendra Patel: అన్నీ చిన్నాచితకా పదవులే.. ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సరాసరి సీఎం పదవితో భూపేంద్ర పటేల్‌ జాక్‌పాట్‌
Bhupendra Patel
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 12, 2021 | 8:49 PM

New Gujarat CM Bhupendra Patel: చాలా చిన్నపదవులను మాత్రమే నిర్వహించిన అనుభవం భూపేంద్ర పటేల్‌కు ఉంది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అహ్మదాబాద్‌ అర్భన్‌డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు సీఎం పదవిని చేజిక్కించుకొని జాక్‌పాట్‌ కొట్టారు భూపేంద్ర పటేల్‌. మోదీ, అమిత్‌షా అపర చాణక్యం అంటే ఇదే. ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకోవడంలో ఈద్వయం ముందుంటుంది. గుజరాత్‌ సీఎం ఎంపిక విషయంలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెల్చిన వ్యక్తికి గుజరాత్‌ సీఎం పదవిని కట్టబెట్టారు. గతంలో మంత్రి పదవి కూడా నిర్వహించని భూపేంద్ర పటేల్‌కు ఏకంగా సీఎం పదవి వరించింది.

పటేల్‌ సామాజిక వర్గంలో భూపేంద్ర పటేల్‌కు మంచి పట్టుంది . అందుకే ఆయన్ను ఏరికోరి ప్రధాని మోదీ, అమిత్‌షా సీఎంగా ఎంపిక చేశారు. గతంలో మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ ప్రాతినిధ్యం వహించిన గట్‌లోడియా నుంచి లక్షా 17 వేల మెజారిటీతో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. వృత్తి రిత్యా బిల్డర్ అయిన భూపేంద్ర పటేల్‌కు చాలా చిన్నపదవులను మాత్రమే నిర్వహించిన అనుభవం ఉంది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అహ్మదాబాద్‌ అర్భన్‌డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు సీఎం పదవిని చేజిక్కించుకొని జాక్‌పాట్‌ కొట్టారు భూపేంద్ర పటేల్‌.

అందరి అంచనాలను తారుమారు చేస్తూ గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఎవరు ఊహించని విధంగా భూపేంద్రపాటిల్‌ను సిఏం ఎంపిక చేశారు. గట్‌లోడియా సీటు నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ అందరూ ఊహించిన విధంగానే పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన నేతకు సీఎం పదవి లభించింది. బీజేపీ ఓ చిన్నస్థాయి కార్యకర్తను సీఎం చేస్తోందని ప్రకటించారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌. పార్టీ పరిశీలకుడిగా ఆయన బీజేపీ ఎమ్మెల్యేల భేటీకి హాజరయ్యారు. మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌కు అత్యంత సన్నిహితుడు భూపేంద్ర పటేల్‌. మాజీ సీఎం విజయ్‌ రూపానీ కొత్త సీఏం పేరును ప్రతిపాదించారు. గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఎంపిక జరిగింది.

Read also:  AICC: తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించిన ఏఐసీసీ.. ఎవరెవరికి..ఏయే పదవులంటే..