Pulasa Fish: జాలర్ల వలకు చిక్కిన పులస చేప.. ధర ఎంత పలికిందో తెలిస్తే షాకవుతారు.!
Pulasa Fish: 'పుస్తెలమ్మయినా సరే పులస కూర తినాలని' అన్నది పెద్దల నానుడి. అందుకే జనాలు పులస తినాలని క్యూ కడతారు. పులస కూర టేస్ట్ సెపరేట్..

ఖరీదైన చేపల గురించి తరచూ వింటుంటాం..కానీ.. మరీ ఇంత ఖరీదైన చేపా? అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ చేప పలికిన ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సహాజం కోనసీమ అనేగానే ముందుగా గుర్తొచ్చేది రకరకాల వంటకాలు. అంతేకాకుండా గోదావరి జిల్లాల ప్రజలు తమ అతిధులకు కొసరి కొసరి మరీ అనేక వంటకాలను వడ్డిస్తారని తెలిసిందే. ఇక వాటిల్లో పులస అత్యంత ప్రత్యేకం. పులస కూరకు యమా ఫాలోయింగ్ ఉంటుందని అని చెప్పాలి.
‘పుస్తెలమ్మయినా సరే పులస కూర తినాలని’ అన్నది పెద్దల నానుడి. అందుకే జనాలు పులస తినాలని క్యూ కడతారు. పులస కూర టేస్ట్ సెపరేట్ అని చెప్పొచ్చు. గోదావరి జిల్లా వాసులు కొసిరి కొసిరి వంటకాలను వడ్డిస్తారని తెలిసిందే. ఇక గోదావరి తీరంలో పులస చేపల జాతర జిగజిగలాడాల్సిందే. ఇదిలా ఉంటే అంతర్వేది నది తీరంలో మత్స్యకారుల వలలో 2 కేజీల పులస చేప చిక్కింది. ఆ పులస చేపను స్థానిక మత్య్సకారులు మార్కెట్‌లో వేలానికి పెట్టగా పులస ప్రియులు ఎగబడి మరీ పాల్గొన్నారు. చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ. 18 వేలకు దక్కించుకున్నాడు.
ఇవి చదవండి:
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో సహాజ నటి.!
గొయ్యిలో దాక్కున్న అడవి పందిని వేటాడిన చిరుత.. వేటను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!