ఆ పెయింటింగ్ ఖరీదు రూ. 300 కోట్లు.. ప్రపంచంలోనే ఆ పెయింటింగ్‌కు రేట్ ఎక్కువ.. అందులోని స్పెషల్ ఎంటంటే..
పెయింటింగ్స్... మనలోని భావాలను.. ఆలోచనలు రంగుల రూపంలో వ్యక్తపరచడం అంటుంటారు. ఒక్క పెయింటింగ్‌లో

పెయింటింగ్స్… మనలోని భావాలను.. ఆలోచనలు రంగుల రూపంలో వ్యక్తపరచడం అంటుంటారు. ఒక్క పెయింటింగ్‌లో ఎన్నో అర్థాలుంటాయి అంటారు. అందుకే లక్షలు పెట్టి మరీ పెయింటింగ్స్ కొంటుంటారు చాలా మంది. కొంతమంది బతుకు దెరువు కోసం పెయింటింగ్స్ వేస్తుంటారు.. అలాగే మరికొంత మంది వాటిపై ఉన్న ఇష్టంతో కాగితంపై రంగులను అద్దుతుంటారు. అయితే బ్రిటన్ కు చెందిన సచా జాఫ్రీ మాత్రం తన పెయింటింగ్స్‌తో పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు.
బ్రిటన్‌కు చెందిన సచా జాఫ్రీ.. ప్రసిద్ధ కళాకారుడు. పెయింటింగ్స్ వేయడం సచా జాఫ్రీకి అలవాటు. అర్థవంతమైన పెయింటింగ్స్ వేస్తాడు. అయితే ఇటీవల ఓ బొమ్మను గీయడానికి ముందు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. కరోనా కాలంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ?.. ఒంటరిగా అయినట్లు ఫీలవుతున్నారా ? ఇలా వాళ్ల అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్ వేసి వాటిని తనకు పంపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్ లోని అట్లాంటిస్ హోటల్ లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటల సమయాన్ని కేటాయించి ఆ పెయిటింగ్ వేసాడు. ఇందుకోసం 1065 పెయింట్ బ్రష్ లు, 6,300 లీటర్ల పెయింట్స్ ను ఉపయోగించాడు. 70 విభాగాలుగా చిత్రించి తర్వాత ఒక్కటిగా కలిపి పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద కాన్వాస్ పెయింటింగ్ గా తయారు చేశాడు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు కూడా సంపాదించుకుంది. అంతేకాదు.. ఇందులో జర్నీ ఆఫ్ హ్యుమానిటీ అనే అర్థం కూడా దాగి ఉంది. దుబాయ్‌లోని ‘ది పామ్’ హోటల్‌లో నిర్వహించిన వేలంలో దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘ఆండ్రీ అబ్దున్’ రూ.300 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తాన్ని రెట్టింపు చేసిన డబ్బును పేద పిల్లల సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ట్వీట్..
View this post on Instagram
Pranitha Wedding: రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..