Viral News : బాలుడిని 30 అడుగులు ఎత్తుకు లాక్కెళ్లిన గాలిపటం.. వీడియో చూస్తే గానీ నమ్మలేరు !

|

Dec 11, 2020 | 5:09 PM

పతంగి ఎగరేయడమంటే చిన్నపిల్లలకు మహా సరదాగా ఉంటుంది. నాది పైకి వెళ్లిదంటే..నాది వెళ్లింది అంటూ తెగ అల్లరి చేస్తూ ఉంటారు.

Viral News : బాలుడిని 30 అడుగులు ఎత్తుకు లాక్కెళ్లిన గాలిపటం.. వీడియో చూస్తే గానీ నమ్మలేరు !
Follow us on

పతంగి ఎగరేయడమంటే చిన్నపిల్లలకు మహా సరదాగా ఉంటుంది. నాది పైకి వెళ్లిదంటే..నాది వెళ్లింది అంటూ తెగ అల్లరి చేస్తూ ఉంటారు. ఈ సీన్స్ అన్ని మనం రెగ్యులర్‌గా చుట్టుప్రక్కల చూస్తూనే ఉంటాం. మన దగ్గర సంక్రాంతి సమయంలో గాలి పటాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఇక గాలి పటాలను పిల్లలు ఎగరవేయడం ఇప్పటివరకు చూసి ఉంటారు. గాలి పటమే ఓ పిల్లాలడిని ఎగరేసుకుపోవడం ఎప్పుడైనా చూశారా..? కనీసం ఊహించి కూడా ఉండరు. అటువంటి ఘటన ఇటీవల ఇండోనేషియాలో జరిగింది.  12 ఏళ్ల బాలుడిని ఏకబికిన గాల్లోకి లాక్కెళ్లి.. గిరా గిరా తిప్పి..కింద పడేసింది. చెప్తుంటే మేమేదో కామెడీ చేస్తున్నామని మీరు అనుకుంటారు. అందుకే వీడియో కూడా పట్టుకొచ్చాం. ముందు దానిపై ఓ లుక్కెయ్యండి.

చూశారుగా..అదీ విషయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లాంపుంగ్‌లోని ప్రింగ్సేవు ప్రాంతంలో కైట్ ఫెస్ట్ లాంటి ఓ ఈవెంట్ జరిగింది. పంట పొలాల్లో గ్రామస్థులు గాలిపటాలను ఎగురవేశారు. తెగ పోటీలు పడి సత్తా చాటారు. ఐతే ఓ భారీ గాలి పటం గాల్లోకి ఎగురుతున్న క్రమంలో.. 12 ఏళ్ల బాలుడు దాని తోకకు చిక్కుకున్నాడు. పతంగితో  పాటు గిర్రున గాల్లోకి ఎగిరిపోయాడు. దాదాపు 30 అడుగులు ఎత్తుకు వెళ్లాడు. అతడి బరువుకు తట్టుకోలేక తోక భాగం తెగిపోవడంతో.. సదరు బాలుడు  కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడడంతో కాళ్లు, చేతులకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పలు సర్జీల అనంతరం ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన