Gulf Of Mexico: సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపంలో లార్వాలు .. మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు
Gulf Of Mexico: మానవుడు రహస్యాన్ని కనిపెట్టాను ప్రకృతిపై పై చేయి సాధించాను అనుకున్నప్పుడల్లా సరికొత్త వింత వెలుగులోకి వచ్చి.. మానవ మేథస్సుకు సవాల్ విసురుతూ..
Gulf Of Mexico: మానవుడు రహస్యాన్ని కనిపెట్టాను ప్రకృతిపై పై చేయి సాధించాను అనుకున్నప్పుడల్లా సరికొత్త వింత వెలుగులోకి వచ్చి.. మానవ మేథస్సుకు సవాల్ విసురుతూ ఉంటుంది. అంతరిక్షంలో, భువిపై . సముద్రం గర్భంలో మనుషులకు అంతుచిక్కని రహస్యాల కోసం అన్వేషణ చేస్తూనే ఉన్నారు. టెక్నాలజీని సరికొత్త పంథాలో ఉపయోగిస్తూ మహా సముద్రం లోతులో దాగున్న రహస్యాల శోధన చేస్తున్నాడు. ఈ పరిశోధనలో అనేక వింతలు, ఆశ్చర్యంకలిగించే విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ నీటి అడుగున ఉన్న 14 రకాల లార్వాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’లో 3,000 అడుగులు లోతైన ప్రాంతాల్లో నివసించే పలు రకాల జాతుల లార్వాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
రొయ్యలు, ఎండ్రకాయల జాతికి చెందిన ఈ జీవులు ఏలియన్స్(గ్రహాంతరవాసుల) రూపాన్ని కలిగి ఉన్నాయని.. వీటిల్లో కొన్నిటికి తలలపై కొమ్ములు ఉన్నాయని అధ్యయన సహ రచయితల్లో ఒకరైన హీథర్ బ్రాకెన్-గ్రిస్సోమ్ స్పష్టం చేశారు. నారింజ, నీలం రంగు వంటి వివిధ షేడ్స్‌తో ఉన్న ఈ లార్వాలు .. సముద్ర జీవుల వయోజన వెర్షన్‌లతో పోలిస్తే విచిత్రమైన లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు. ఇదే విషయంపై ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన బ్రాకెన్-గ్రిస్సమ్.. స్పందిస్తూ.. సముద్రంలో కనిపించే రొయ్యలు సాధారణంగా బహుళ లార్వా దశలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని జీవులు వివిధ దశల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. గతంలో తమ సీనియర్ సహచరులు కనుగొన్న లార్వాలతో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన లార్వాల ను సరిపోల్చేందుకు డిఎన్ఏ బార్‌కోడింగ్, మోర్ఫాలాజికల్ మెథడ్స్ ఉపయోగించారని వెల్లడించారు. బ్రాకెన్-గ్రిస్సోమ్ సముద్ర గర్భంలోని రహస్యాలను అన్వేషించడం.. లోతైన జీవులపై పరిశోధన చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనే అనేక పరిశోధనలు చేశారు. బ్రాకెన్ కనుగొన్న సూక్ష్మ-పరిమాణ జీవులను బహిర్గతం చేయడానికి ఉపయోగించిన జన్యు పద్ధతుల ద్వారానే 2012లోనూ ‘సెరాటాస్పిస్ మోన్‌స్ట్రోసా’ అని పిలువబడే జాతులను గుర్తించగలిగారు.
సముద్రంలోని మెసోపెలాజిక్ జోన్‌లో అనేక రకరకాల జీవులు నివసిస్తున్నాయని బ్రాకెన్ చెబుతున్నారు. ఇక్కడ సముద్రం లోతు 650 నుంచి 3,200 అడుగుల ఉంటుందని తెలిపింది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన కొన్ని జీవి.. కొంత వయసు వచ్చిన తర్వాత సముద్ర గర్భంలోకి వెళ్లి జీవించడానికి ఇష్టపదతాయని చెప్పారు అయితే ఈ జాతులకు చెందిన జీవులను కొన్ని రకాల చేపలు, త్రిమింగాలాలు వంటి వేటాడి తింటాయి. వీటికి ఈ జీవుల లార్వలే ఆహారమని బ్రాకెన్-గ్రిస్సోమ్ అన్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన 14 జీవుల లార్వాలు జీవన విధానం.. లైఫ్ సైకిల్, అవి ఏ విధంగా పెరుగుతాయి వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు మరింత లోతుగా అధ్యయనం చేస్తారని ఆమె చెప్పారు.
Also Read: వింత రెసిపీలు గుడ్డుతో పాప్‌కార్న్.. పుస్తకం డీప్ ప్రై.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు