Lady constable: ఇదీ.. ఉద్యోగం చేసే విధానం.. లేడీ కానిస్టేబుల్ అబ్బురపరిచే ముందు చూపు. వాచ్.. వీడియో

ఇదీ.. ఉద్యోగం చేసే విధానం. లేడీ కానిస్టేబుల్ మేడమ్.. మీ అబ్బురపరిచే ముందు చూపు ఒక అద్భుతం.. ఇవే కామెంట్లు ఇప్పుడు ఆమె గురించి ఇంటా బయటా వినిపిస్తున్నాయి.

Lady constable: ఇదీ.. ఉద్యోగం చేసే విధానం.. లేడీ కానిస్టేబుల్ అబ్బురపరిచే ముందు చూపు. వాచ్.. వీడియో
RPF Lady Constable
Follow us

|

Updated on: Oct 22, 2021 | 11:57 AM

RPF Lady constable: ఇదీ.. ఉద్యోగం చేసే విధానం. లేడీ కానిస్టేబుల్ మేడమ్.. మీ అబ్బురపరిచే ముందు చూపు ఒక అద్భుతం.. ఇవే కామెంట్లు ఇప్పుడు ఆమె గురించి ఇంటా బయటా వినిపిస్తున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలోని ఒక రైల్వే స్టేషన్లో ఒక మహిళను పెద్ద ప్రమాదం నుంచి రక్షించిన లేడీ కానిస్టేబుల్ సమయస్పూర్తికి రైల్వే వర్గాలే కాదు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, నెటిజన్లు సైతం మహిళా కానిస్టేబుల్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాండ్‌హర్స్ట్‌రోడ్ స్టేషన్‌లో గురువారం మధ్యాహ్నం 50 ఏళ్ల మహిళా ప్యాసింజర్ బద్లాపూర్ వెళ్తోన్న లోకల్ ట్రైన్ లోని మహిళా జనరల్ కోచ్‌లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఈ క్రమంలో ఆమె ట్రైన్ ఎక్కుతూ కిందపడిపోయింది. అయితే, సదరు మహిళా ప్రయాణీకురాలు రైలు కదలడం ప్రారంభించగానే దాన్ని ఎక్కడానికి ప్రయత్నించడాన్ని కొంచెం దూరంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ గ్రహించింది. అంతే, ఏంజరుగబోతోందో ముందే గ్రహించిన ఆ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) మహిళా కానిస్టేబుల్ మెరుపు వేగంతో ప్రయాణీకురాలి దగ్గరకి పరుగుపరుగున వెళ్లింది.

ట్రైన్ పట్టుకొని వేలాడుతూ పట్టాల మీదకు వెళ్లిపోబోతోన్న మహిళా ప్రయాణీకురాల్ని గట్టిగా వెనక్కిలాగి రక్షించగలిగింది. ఇంతటి కార్యదక్షతను ప్రదర్శించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన RPF మహిళా కానిస్టేబుల్ పేరు సప్నా గోల్కర్‌. ఈ దృశ్యాలు స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సెంట్రల్ రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారడమేకాదు, సప్నా గోల్కర్ ను సెలబ్రెటీని చేసేసింది.

Read also: Paritala Sunitha: మాలో ప్రవహించేది సీమ రక్తం.. చంద్రబాబు మారాలి.. పరిటాల సునీతమ్మ సంచలన కామెంట్స్