Paritala Sunitha: మాలో ప్రవహించేది సీమ రక్తం.. చంద్రబాబు మారాలి.. పరిటాల సునీతమ్మ సంచలన కామెంట్స్

మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓకే అంటే ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. చంద్రబాబు ఇకనైనా మారాలని

Paritala Sunitha: మాలో ప్రవహించేది సీమ రక్తం.. చంద్రబాబు మారాలి.. పరిటాల సునీతమ్మ సంచలన కామెంట్స్
Paritala Sunitha
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 22, 2021 | 12:13 PM

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓకే అంటే ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. చంద్రబాబు ఇకనైనా మారాలని, ఆయన గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుందని వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. తమదీ సీమ రక్తమేనని, తమకు బీపీ వస్తుందని పరిటాల సునీత ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న రాజకీయ రగడపై వ్యాఖ్యానించారు.

అటు, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు సైతం ఇవాళ మండిప‌డ్డారు. త‌మ నేత‌ల‌పై ఏపీ మంత్రులు బూతు వ్యాఖ్యలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తాము ఏపీలో అధికారంలోకి వ‌స్తామ‌ని, జగన్ రెడ్డి ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాలంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాల‌రాస్తోన్న ఏపీ మంత్రులతో పాటు అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతామ‌ని తెలిపారు. ఎన్నో కేసుల్లో జ‌గ‌న్ ముద్దాయిగా ఉన్నారని ఆయ‌న గుర్తు చేశారు.

ఏపీలోని 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి తాము చెబుతోంటే దాన్ని పక్కదారి పట్టించడానికే త‌మ కార్యాల‌యాలు, ఇళ్లపై దాడులు జ‌రుపుతున్నార‌ని దేవినేని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ధ‌ర‌లను పెంచేశార‌ని, ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.

కాగా, తిరుపతిలో వైసిపి జనాగ్రహ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మకు పాడే కట్టి శవయాత్ర నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. సెంట్రల్ పార్క్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దాకా దిష్టిబొమ్మను ఉరేగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Read also: Huzurabad – Kishan Reddy: ఈటెలను ఓడించడానికి వందల కోట్లు: టీవీ9 తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!