AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: చెట్టు మాటున 5 పక్షులు.. 15 సెకన్లలో కనుక్కుంటే.. మీ ఐ పవర్ సూపర్..

ఆప్టికల్ ఇల్యూషన్ అంటే కళ్ళను మోసం చేయడం. ఇలాంటి ఫొటోలు కొంచెం తేడాగా ఉంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలలో కొన్ని పక్షులు దాగి ఉన్న ఒక చెట్టు ఉంది. కానీ అవి సులభంగా కనిపించవు.

Optical Illusion: చెట్టు మాటున 5 పక్షులు.. 15 సెకన్లలో కనుక్కుంటే.. మీ ఐ పవర్ సూపర్..
Optical Illusion photo
Venkata Chari
|

Updated on: Aug 17, 2022 | 7:55 AM

Share

Optical Illusion: సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటితో పాటు మొదడుకు మేత పెట్టే ఎన్నో ఫొటోలు కూడా సందడి చేస్తుంటాయి. ఇలాంటి వాటినే ఆఫ్టికల్ ఇల్యూషన్ ఫొటోలు అంటుంటారు. ఇలాంటి ఫొటోలు మెదడుకు పదును పెట్టడమే కాగ, సహనానికి కూడా పరీక్ష పెడుతుంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్‌తో ఉన్న ఫొటోలు తరచుగా మనస్సును కదిలిస్తాయి. ఎందుకంటే అవి చూడడానికి విచిత్రంగా ఉంటాయి. వీటిని పరీక్షించి చూస్తే, అందులో మరికొన్ని ఫొటోలు కనిపిస్తాయి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను 20 సెకన్ల పాటు చూస్తే, అందులోని తేడాలను ఇట్టే పట్టేయవచ్చు.

ఆప్టికల్ ఇల్యూషన్ అంటే కళ్ళను మోసం చేయడం. ఇలాంటి ఫొటోలు కొంచెం తేడాగా ఉంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలలో కొన్ని జంతువులు దాగి ఉన్న ఒక అడవి ఉంది. కానీ అవి సులభంగా కనిపించవు. వాటిని కనుగొనడం ఒక సవాలుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రజల మనస్సులను కలిచివేస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే ఇటువంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలను పరిష్కరించగలుగుతారు. 99 శాతం మంది వీటిని పరిష్కరించడంలో విఫలమవుతుంటారు.

Optical Illusion photo

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఇలాంటి ఓ ఇమేజ్ నెట్టింట్లో సందడి చేస్తోంది. అందులో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో ఐదు పక్షులు దాగి ఉన్నాయి. మీరు ఈ పక్షులను కనుగొనాలి. ఇది మీకో సవాల్. ఎందుకంటే ఒక్క చూపులో చూస్తే చెట్టులా కనిపించినా, జాగ్రత్తగా చూస్తే అందులో కొన్ని పక్షులు కూడా కనిపిస్తాయి. అయితే దీనికి చాలా ఏకగ్రాత అవసరం.

Optical Illusion

మీరు ఫొటోలో దాగి ఉన్న పక్షిని కనుగొనలేకపోతే, మేం మీకు సూచనలు అందిస్తాం. అందులో ఒక కోడి, కోడిపుంజు, మూడు కోడిపిల్లలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ కనుగొనలేకపోతే, కింది ఫొటోను చూస్తే సరి. చెట్టు మధ్యలో ఒక కోడిపుంజును గమనించవచ్చు. దాని పక్కనే రెండు కోడి పిల్లలను చూడొచ్చు. వాటికి ఎడమవైపున ఒక కోడి, మరొక కోడి పిల్లను చూడొచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..