ఒక దేశంలో అసలే చీకటి పడదు.. మరో దేశంలో పగలు అసలే ఉండదు.. వింతైన దేశాలు చూడాలని ఉందా..?
Strange Countries : సూర్యుడు, చంద్రుడు. ఒకరు పగలు వస్తే మరొకరు రాత్రికి వస్తారు. ఇది నిత్యం అన్ని దేశాల్లో జరిగే ప్రక్రియే. కానీ కొన్నిదేశాల్లో
Strange Countries : సూర్యుడు, చంద్రుడు. ఒకరు పగలు వస్తే మరొకరు రాత్రికి వస్తారు. ఇది నిత్యం అన్ని దేశాల్లో జరిగే ప్రక్రియే. కానీ కొన్నిదేశాల్లో మాత్రం చంద్రుడు రాడు.. సూర్యుడే ఎక్కువ కాలం ఉంటాడు. దీంతో అక్కడ చీకటే పడదు. ఇంకో దేశంలో సూర్యుడు రాడు, అక్కడ చీకటి పడదు. ఈ చిత్ర విచిత్రాల జాబితాలో నార్వే, ఫిన్‌లాండ్, స్వీడన్, ఐలాండ్, అలస్కా తదితర దేశాలున్నాయి. ఈ వింత వాతావరణం, ఆ దేశ విశేషాలు తెలుసుకుందామా.
ఉత్తర ఐరోపాకు చెందిన దేశం నార్వే. దీనిని కింగ్‌డమ్ ఆఫ్ నార్వే, యూనిటరీ, మొనార్చీ అని కూడా పిలుస్తారు. అతితక్కువ జనాభా గల దేశాల్లో ఇది ఒకటి. ఇది ఎత్తైన, మంచు పర్వతాలతో కూడుకున్న దేశం. అందుకే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కానీ, మే చివర నుంచి జూలై వరకు సూర్యుడు ఎక్కువ సమయం ఉంటాడు. ఆ సమయంలో పగటిపూట ఏకంగా 20గంటల వరకు ఉంటుంది. అందుకే దీనిని మిడ్‌నైట్ సన్ ల్యాండ్ అని కూడా పిలుస్తుంటారు. దీంతో రాత్రి అనేది లేకుండా పోతుంది. అర్ధరాత్రి వరకు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈ సమయంలో ప్రజలు తమ వాచ్‌లను చూసుకుని నిద్రపోతుంటారు. ఆఫీసు వేళలను, పనులు చేసుకోవడం చేస్తుంటారు.
ఉత్తర ఐరోపా సార్వభౌమాధికారం కలిగిన దేశాల్లో ఫిన్‌లాండ్ ఒకటి. ఇక్కడ సుమారు 6మిలియన్ల జనాభా ఉంది. స్వతంత్ర ఐలాండ్ ద్వీపాలలో ఇది ఒకటి. స్వీడన్ నుంచి వేరుపడిన దేశమిది. ఇక్కడ 1.70లక్షల వరకు సరస్సులు, 1.80లక్షల వరకు ద్వీపాలు ఉండడం గమనార్హం. ఎక్కువ మంచు పర్వతాలు కలిగిన దేశం. అంతేకాదండోయ్ ఇక్కడి భూమి ఏటా సెంటిమీటర్ పెరుగుతుంది. బౌన్ ఎలుగుబంట్లు ఉండేది ఇక్కడే. ఉత్తర, దక్షిణ సముద్ర తీరాల్లో పెను వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఉత్తర దిశలో సూర్యుడు వేసవిలో 73 వరుసగా రోజులు అస్తమించడం. అలాగే 51 రోజులు ఉదయించడు.