Collector Gandham Chandrudu : పలుగు, పార చేతపట్టిన అనంతపురం జిల్లా కలెక్టర్, ఉపాధి హామీ కూలిపనులపై ఆరా
Collector Gandham Chandrudu : అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరోసారి పలుగు పార చేతపట్టారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో..
Collector Gandham Chandrudu : అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరోసారి పలుగు పార చేతపట్టారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన ఇవాళ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఆత్మకూరు మండలం వడ్డిపల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్ కూలీలను అడిగి పలు అంశాలపై ఆరా తీశారు. పనులు ప్రతి రోజు కల్పిస్తున్నారా ?, క్రమం తప్పకుండా డబ్బులు అందిస్తున్నారా? అని కూలీలను అడిగారు. అనంతరం కూలీల్లో ఉత్సాహం నింపేందుకు పలుగుపార చేతబట్టి ఉపాధి పనులు చేశారు.
భీమ్ దీక్ష చేస్తున్న కలెక్టర్ కాళ్లకు చెప్పులు లేకుండానే నీలం చొక్కా ధరించి పనులు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మరికొంత మంది పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 2లక్షల 30వేల మంది పని చేస్తున్నారని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో ఆరున్నర లక్షల మందికి పని కల్పించి.. దేశంలో ఒక రికార్డు సృష్టించామన్నారు. వేసవి కాలం, కోవిడ్ నేపథ్యంలో కూలీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.