Coconut and Diabetes : కొబ్బరి నీరు మధుమేహగ్రస్తులకు మంచిదేనా..! రోజుకి ఎంత మొత్తంలో తాగాలంటే…!

ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. ఎటువంటి ఆరోగ్య సమస్యలెదురైనా సరే.. కొబ్బరి నీళ్లు తాగితే చాలు.. సమస్య నుంచి సగం విముక్తి పొందినట్లే..

Coconut and Diabetes : కొబ్బరి నీరు మధుమేహగ్రస్తులకు మంచిదేనా..! రోజుకి ఎంత మొత్తంలో తాగాలంటే...!
Coconut Water
Follow us

|

Updated on: Mar 23, 2021 | 7:04 PM

Diabetes : ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. ఎటువంటి ఆరోగ్య సమస్యలెదురైనా సరే.. కొబ్బరి నీళ్లు తాగితే చాలు.. సమస్య నుంచి సగం విముక్తి పొందినట్లే.. మరి అంతటి ఔషధ గుణాలున్న కొబ్బరి నీళ్లు సహజంగా తీయ్యగా ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధి గ్రస్తులు కొబ్బరి నీటిని తాగవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. కొంతమంది కొబ్బరి నీరు తియ్యగా ఉంటుంది కనుక రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని త్రాగడానికి భయపడుతుంటారు. అయితే కొబ్బరి నీరు డయాబెటిస్ వారికీ మంచిదేనా కదా తెలుసుకుందాం..!

*కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో ఉండే పోషకాల వల్ల శరీరానికి అధిక శక్తి అందుతుంది. తక్కువ మొత్తంలో ఉండే సోడియం, చక్కెర, ఎక్కువ మొత్తంలో ఉండే క్లోరైడ్, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరం హైడ్రేట్ అవడమే కాకుండా పునరుత్తేజితం చెందుతుంది.

* కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని రక్తనాళాలు వెడల్పై రక్తం సులభంగా ప్రసరిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాళ్లు, చేతుల వాపును తగ్గిస్తాయి షుగర్ పేషేంట్స్ కు కొబ్బరి నీరు సురక్షితమేనా అంటే ఎటువంటి అనుమానం లేకుండా కొబ్బరినీరు తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 2015 లో డయాబెటిస్ పై జరిపిన అధ్యయనంలో డయాబెటిస్ ఉన్న యువకులకు డైట్ పరీక్షను విజయవంతంగా ఆమోదించింది. *కొబ్బరి నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. * అయితే కొబ్బరి నీరును రోజూ ఉదయం పరగడపున త్రాగితే మంచిది. వీటిలోని ఖనిజలవణాలు శరీరానికి పుష్కలంగా అంది.. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మధుమేహ వ్యాధి గ్రస్తులు గుర్తించుకోవల్సిన ముఖ్యమైన విషయం కొబ్బరి బోంఢాం చాలా లేతగా కొబ్బరి లేని కాయలను ఎంపిక చేసుకోవాలి. లేత కొబ్బరి బొంఢాంలోని నీరు వగరుగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటుంది. *కొబ్బరి నీళ్ళలో ఉండే ఫ్రక్టోజ్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కొబ్బరి నీటిలో తక్కువ ఫ్రక్టోజ్ (సుమారు 15%) ఉంటుంది, మరియు ఫ్రక్టోజ్ మీ రక్తంలో చక్కెర స్థాయికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి. అందరూ ఇష్టపడి తాగే న్యాచురల్ డ్రింక్ కూడా.. మరి క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ప్రతి రోజూ ఓ కొబ్బరి బోండం తాగేద్దామా..!

Also Read: Zombie Reddy in OTT: త్వరలో ఓటిటిలో జాంబిరెడ్డి మూవీ.. స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఆహా

రంగుల పండగ హోలీని మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారంటే..!