AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flaxseeds Benefits:అవిసె గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్ అంటారు పెద్దలు..వాటిని తింటే లాభ నష్టాలు ఏమిటో తెలుసుకుందాం..!

విసె గింజ‌లు రుచిలో పెద్ద ప్ర‌త్యేక‌త ఏమీ లేక‌పోయినా ఈ గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్ అని అంటారు ఆరోగ్య నిపుణులు. వీటిల్లో విటమిన్లు , ప్రోటీన్ , ఆమ్లాలు వంటి పోషకాలు అనేకం ఉన్నాయి...

Flaxseeds Benefits:అవిసె గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్ అంటారు పెద్దలు..వాటిని తింటే లాభ నష్టాలు ఏమిటో తెలుసుకుందాం..!
Flaxseeds
Surya Kala
|

Updated on: Mar 23, 2021 | 3:04 PM

Share

Flaxseeds Benefits: అవిసె గింజ‌లు రుచిలో పెద్ద ప్ర‌త్యేక‌త ఏమీ లేక‌పోయినా ఈ గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్ అని అంటారు ఆరోగ్య నిపుణులు. వీటిల్లో విటమిన్లు , ప్రోటీన్ , ఆమ్లాలు వంటి పోషకాలు అనేకం ఉన్నాయి. అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగల వని ప్రముఖ డైటీషియన్ తమర్ శ్యామ్యూల్ చెప్పారు. ఇక “ఎక్కడైతే ప్రజలు అవిసె గింజలను తమ రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటారో, అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్ల విరుస్తుందని” మహాత్మాగాంధీ ఏనాడో అన్నారు. నిజమే.. ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. వంటకాల్లో ఉపయోగించడానికి సులభమైనవి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అవిసె అత్యంత శక్తివంతమైనది. వీటి ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం..!

1. అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లా‌లు అధికం. చేపలలో ఉండే ఆరోగ్యకరమైన ఒమేగా -3 అవిసె గింజల్లో ఉంటాయని డైటీషియన్ జెన్నిఫర్ మిమ్ఖా చెప్పారు .

2 ఈ గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది.

3. అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయని శ్యామ్యూల్ చెప్పారు. అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ స్పందన సమతుల్యం అవుతుందని అన్నారు. అవిసె గింజల్లోని లిగ్నన్స్ కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమని తెలిపారు.

4. అవిసె గింజలలో గల ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ ల నిరోధానికి దోహదం చేస్తాయి. వేయించి పొడిచేసి అవిసె గింజల పొడిని అన్ని ఆహార పదార్ధాలలోనూ కలపవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

5 అవిసె గింజలు రక్తంలోని షుగర్ లెవెల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 20 శాతం వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని శామ్యూల్స్ చెప్పారు. ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. అవిసె గింజల్లో ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ అధికంగా ఉండటంతో తరచు తీసుకుంటే మధుమేహం బారిన త్వరగా పడరని చెప్పారు.

6. అవిసె గింజలో అధిక మొత్తంలో ఉన్న ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను వృద్ధి చేస్తుంది. అతిసారం , మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది

7. అవిసె గింజలు చర్మం గ్రంథులు ఉత్పత్తి చేసే ఒక జిడ్డు పదార్ధం సిబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. తద్వారా మొటిమలు రాకుండా అరికడతాయి. ఇక వీటిల్లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి. అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. ఈ గింజలను తినడం వల్ల అందమైన ఒత్తైన జట్టు సొంతం చేసుకోవచ్చు.. గోర్లు బలంగా పెరుగుతాయి.

8. అవిసె గింజలు హార్మోన్లను నియంత్రించగలదు. రుతు చక్రం మీద ప్రభావం చూపుతుంది. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.

అయితే ఈ అవిసె గింజలు తింటే కొంతమందికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషేంట్స్ , గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోక పోవడం మంచిది.

Also Read:: దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయ ములక్కాయ మెంతి ఆవకాయ తయారీ విధానం తెలుసుకుందాం..!

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం… తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...