Zombie Reddy in OTT: త్వరలో ఓటిటిలో జాంబిరెడ్డి మూవీ.. స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఆహా
కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓటీటీ...
Zombie Reddy in OTT: కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓటీటీ వేదిగా స్ట్రీం అవనుంది. ఆహాలో ఈ మార్చి 26 న ప్రసారం కానుంది.
సందర్భంగా ఆహా.. జాంబి రెడ్డి మూవీ కి ఓ స్పెషల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. అరె మామ లాక్‌డౌన్ ఎత్తేశారంటరా అంటూ.. స్టార్ట్ అయిన ఈ ట్రైలర్.. ఫన్‌ఫుల్గా … థ్రిల్ ఫుల్ గా సాగింది. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సాదిస్తోంది.
ఇక ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమాను.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. ఈ డైరెక్టర్ ‘అ’ సినిమాతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకుని ఇక ఇప్పుడు జాంబిరెడ్డి హిట్‌తో ఆ పేరును సుస్తిరం చేసుకున్నాడు. ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడు. యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజశేఖర్ వర్మ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ఆనంది, దక్ష నగర్కర్, హర్షవర్థన్, రఘుబాబు, హరితేజ, పృథ్వీరాజ్, కారుమంచి రఘు తదితరులు నటించారు.
Also Read: BREAKING NEWS: నక్సల్స్ దుశ్చర్య.. జవాన్లు వెళ్తున్న బస్సుపై ఐఈడీతో దాడి.. ముగ్గురు మృతి