Mysterious Village: అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట.. ఎందుకు ఇలా జరుగుతోంది.. ఎక్కడుంది..

|

Jul 23, 2021 | 7:58 PM

ఈ ప్రపంచం రహస్యాలతో నిండి ఉంది. ఈ రోజు కూడా భూమిపై ఇలాంటి రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా.. ఈ రోజు  అలాంటి ఓ గ్రామం గురించి తెలుసుకుందాం. అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే...

Mysterious Village: అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట.. ఎందుకు ఇలా జరుగుతోంది.. ఎక్కడుంది..
Mysterious Village
Follow us on

మన ఇప్పటికి చాలా సార్లు చదవి ఉంటాం.. సినిమాల్లో కూడా చూసి ఉంటాం. ప్రతి నగరంలో ఓ భూతాల బంగ్లా.. భూత్ భవన్.. ఇలాంటివి కొన్ని సార్లు భయపెడుతుంటాయి.. కొన్నిసార్లు అంతేగా అంటూ కొట్టిపారేస్తుంటాం.. అక్కడ మనిషి వెళ్ళిన తర్వాత తిరిగి రాడు.. కానీ వాస్తవానికి ఇంతటి వెంటాడే స్థలాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కాకపోతే ఈ రోజు మీకు అలాంటి ఓ గ్రామం గురించి  చెప్పబోతున్నాం. ప్రపంచంలో అంతా ఈ గ్రామాన్ని ‘చనిపోయినవారి నగరం’ అని కూడా పిలుస్తుంటారు.

ఈ ప్రపంచం రహస్యాలతో నిండి ఉంది. ఈ రోజు కూడా భూమిపై ఇలాంటి రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా.. ఈ రోజు  అలాంటి ఓ గ్రామం గురించి తెలుసుకుందాం. అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే అది చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడకు వెళ్ళిన వారెవరూ తిరిగి  రాలేదు. మర్మమైన ఈ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని కూడా పిలుస్తారు.

మనం మాట్లాడుకుంటున్న ఈ గ్రామం రష్యాలోని ఉత్తర ఒస్సేటియాలోని దర్గావ్స్‌లో ఉంది. ఈ ప్రాంతం చాలా నిర్మాణుష్యంగా ఉంటుంది. ఆ ప్రదేశంను చూస్తేనే అదోలా ఉంటుంది. అక్కడ పక్షల కిల కిలరావాలు… గాలి నుంచి వచ్చే శబ్దాలు కూడా వినిపించవు. అంతా నిశబ్ధంగా ఉంటుంది. మీరు ఏ సమయంలో వెళ్లిన అలానే ఉంటుంది. అక్కడ అన్నీ ఎత్తైన పర్వతాలు ఉంటాయి . వాటి మధ్యలో దాగి ఉన్నట్లుగా ఈ గ్రామం ఉంటుంది. సహజంగా మనం ఏ గ్రామాన్ని… పట్టణాన్ని చూసినా స్వాగతం పలుకుతున్నట్లుగా… రా రామ్మని పిలుస్తున్నట్లుగా అనిపిస్తే ఇక్కడి ఈ గ్రామం మాత్రం మరోలా ఉంటుంది. ఓ చిన్న కొండపై తెల్ల రాళ్లతో కట్టిన 90 కి పైగా క్రిప్ట్ ఆకారపు ఇళ్ళు ఇటువైపు ఎందుకు చూస్తున్నారు అన్నట్లుగా ఉంటాయి.

ఈ ఇళ్ళు 14 వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి

అయితే అసలు కథలోకి వస్తే.. ఇక్కడి స్థానిక ప్రజలు తమ కుటుంబాల సభ్యుల మృతదేహాలను అందులో పాతిపెట్టారట. ఈ ఇళ్లలో చాలా వరకు నాలుగు అంతస్తుల భవనాలే  మనకు ఇక్కడ కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న ఆలోచన మరణం తరువాత కూడా ప్రజలు ఒకరితో ఒకరు భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండాలని వీటిని నిర్మించారన చెప్పుకుంటారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ బహుళ అంతస్తుల భవనాలు 14 వ శతాబ్దంలో నిర్మించబడ్డాయని అంటారు.

పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ సమాధుల సమీపంలో పడవలు లభించాయి. స్వర్గం చేరుకోవడానికి ఆత్మ నదిని దాటవలసి ఉంటుందని ఇక్కడి వారి నమ్మకం… అందుకే ఇక్కడ చనిపోయినవారితోపాటు ఓ పడవ వదిలిపెడుతుంటారు. కాబట్టి మృతదేహాలను పడవలో ఖననం చేయడం వీరి ఆచారం అని చరిత్రకారులు తెలిపారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం… ప్రతి భవనం ముందు ఓ నిధి నిక్షేపాలతో కూడిన ఓ బావి కూడా ఉందని అంటారు. పురాతన కాలంలో మృతదేహాలను ఇక్కడ ఖననం చేసిన తర్వాత బావిలో నాణేలు విసిరినట్లు చెబుతారు. నాణెం నేరుగా అందులోని రాళ్లను  తాకినట్లయితే, ఆత్మ స్వర్గానికి చేరిందని నమ్ముతారు. ఒకప్పుడు కష్టతరమైన ఈ ‘నగరానికి’ ప్రవేశించిన వారు తిరిగి రారని నమ్ముతారు. అయితే ఈ భవంతుల్లోని శవాలు కుళ్ళి పోకుండా ఉన్నాయని అక్కడి పరిశోధకులు చెబుతుంటారు. ఇవి ఎందుకు కుళ్ళి పోలేదనేది మాత్రం ఎవరికి అందని ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి: TTD – Anti Drone: తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ.. ఆలయ రక్షణలో డీఆర్‌డీవో సాంకేతికత

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..

PM Kusum: రైతులకు మరో గొప్ప అవకాశం.. వ్యవసాయ క్షేత్రంలోనే బిజినెస్.. ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం..