పెళ్లి రోజు కానుకగా భార్యకు అతి పెద్ద బంగారు నెక్లెస్.. అసలు విషయం తెలుసుకొని షాకైన పోలీసులు.. ఎక్కడంటే..
పెళ్లి రోజు కానుకగా తమ భార్యలకు ప్రత్యేకంగా ఏదైన వస్తువు ఇవ్వాలనుకుంటారు చాలా మంది. చీరలు, నగలు, గాజులు ఇలా ఏదో ఓక వస్తువు ఇవ్వాలని ఆలోచిస్తుంటారు.

పెళ్లి రోజు కానుకగా తమ భార్యలకు ప్రత్యేకంగా ఏదైన వస్తువు ఇవ్వాలనుకుంటారు చాలా మంది. చీరలు, నగలు, గాజులు ఇలా ఏదో ఓక వస్తువు ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. పెళ్లి రోజు కానుకగా పెద్ద బంగారు నెక్లెస్ ఇచ్చాడు. ఇక ఆ మహిళ ఆ నెక్లెస్ ధరించన తర్వాత మైక్ లో పాట పాడుతూ.. సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఇంకేముందు ఆ ఫోటోలు చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే అతడిని విచారణ కోసం స్టేషన్ కు తీసుకెళ్లారు.
ఇక స్టేషన్కు తీసుకువచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్పిన విషయాలను పోలీసులకు ఖంగుతిన్నారు. తాను ఆ హారం బంగారంతో చేయలేదని.. నకిలీదని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. తాను చాలా కాలం క్రితమే ఆ నెక్లెస్ ను రూ. 38,000 లకు తీసుకున్నాడని.. పెళ్లి రోజు సందర్భంగా తన భార్య ముచ్చటపడి మరీ ఆ నెక్లెస్ ధరించిందని చెప్పాడు. జువెల్లరీ వ్యాపారులతో కూడా తాము ఆ నగ గురించి మాట్లాడామని అది నకిలీదని.. బంగారంతో చేయలేదని సీనియర్ సీఐ కొంగావ్ పోలీసు గణపత్ పింగిల్ అన్నారు. కేవలం భద్రత కారణంగానే అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళినట్లుగా చెప్పారు.
VIRAL VIDEO | लग्नाच्या वाढदिवशी नवऱ्याने एक किलो सोन्याचा हार भेट दिल्याचा व्हिडीओ व्हायरल झाला होता, मात्र हा हार खोटा असल्याचे खुद्द बाळू कोळी यांनी सांगितले #1KgGoldNecklace | #BaluKoli | #Kalyan | #ViralVideo | #trendingvideo | #Bhiwandi pic.twitter.com/kw3QhwFjRR
— Anish Bendre (@BendreAnish) May 23, 2021
Heroine Radhika Apte : ఒక్క సినిమాకు నాతో డబుల్ వర్క్ చేయించారు.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్..