హిందీపై తలైవా కూడా.. ఆ ప్రసక్తే లేదన్న రజనీ

దేశవ్యాప్తంగా హిందీని ఉమ్మడి అధికార భాషగా చేయాలన్న హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదనకు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నో చెప్పేశాయి. ఈ రాష్ట్రాల సీఎం లు, సినీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు షా సూచనను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దీనిపై స్పందిస్తూ ఉమ్మడి భాష అనే సిధ్ధాంతాన్ని బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో ‘ దురదృష్టవశాత్తూ ‘ ఈ ప్రతిపాదన హేతుబధ్ధం […]

హిందీపై తలైవా కూడా.. ఆ ప్రసక్తే లేదన్న రజనీ
Follow us

|

Updated on: Sep 18, 2019 | 4:04 PM

దేశవ్యాప్తంగా హిందీని ఉమ్మడి అధికార భాషగా చేయాలన్న హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదనకు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నో చెప్పేశాయి. ఈ రాష్ట్రాల సీఎం లు, సినీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు షా సూచనను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దీనిపై స్పందిస్తూ ఉమ్మడి భాష అనే సిధ్ధాంతాన్ని బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో ‘ దురదృష్టవశాత్తూ ‘ ఈ ప్రతిపాదన హేతుబధ్ధం కాదని తేల్చారు. కామన్ లాంగ్వేజ్ అన్నది ఈ దేశానికే కాదు.. మరే దేశానికీ మంచిది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.’ తమిళనాడే కాదు.. ఏ దక్షిణాది రాష్ట్రమూ ఇందుకు ఒప్పుకోదు.. అలాగే ఉత్తరాదిలో పలు రాష్ట్రాలు కూడా అంగీకరించబోవు ‘ అని రజనీ పేర్కొన్నారు.కాగా- అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నెల 20 న తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తామని డీఎంకె ప్రకటించింది. ఇది నిరంకుశ నిర్ణయమని ఈ పార్టీ అధినేత స్టాలిన్ విమర్శించారు. ఎన్డీయే సర్కార్ లో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకె కు చెందిన మంత్రి కె. పాండ్యరాజన్ కూడా షా ప్రకటనను వ్యతిరేకించారు.

Amithshah

హిందీని ఏకపక్షంగా రుద్దిన పక్షంలో తమిళనాడులోనే కాక , పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు మొదలవుతాయని ఆయన చెప్పారు. అటు-షా సూచనపై ఏపీ, తెలంగాణ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకపోయినప్పటికీ.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. హిందీని అధికార భాషగా చేయాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు. హిందీ ప్రతి భారతీయుని మాతృ భాష కాదు.. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి భారతీయునికి తన భాషను ఎంచుకునే హక్కు ఉంటుంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఈ ప్రతిపాదనపై డిబేట్ ఈనాటిది కాదు.. సుమారు వంద సంవత్సరాల క్రితమే దీనిపై మహాత్మా గాంధీ కూడా స్పందించారు. తన ఆటోబయాగ్రఫీలో ఆయన.. హిందీతో బాటు సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఇంగ్ల్లీష్ భాషలను కూడా విద్యా సంస్థల్లో బోధించాలని సూచించారు. అంతేకాదు.. హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలను ఒకే భాషగా పరిగణించవచ్ఛునని అభిప్రాయపడ్డారు. 1963 నాటి అధికార భాషా చట్టం ప్రకారం.. హిందీ, ఇంగ్ల్లీష్ భాషలను కేంద్రం, పార్లమెంటు అధికార భాషలుగా గుర్తించాయి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు కింద దేశంలో మొత్తం 22 భాషలను ఇలా గుర్తించారు.