‘పీవోకే’ లొల్లి..పాక్ వర్రీ..తిప్పికొట్టిన భారత్!

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఏదో ఒక రోజు భారత్‌లో అంతర్భాగమవుతుందన్న కేంద్రమంత్రి జయశంకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పాక్‌. భారత్‌  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని..దీన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా పరిగణించాలని కోరింది. ఇలాంటి ప్రకటనల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని చెప్పుకొచ్చింది. పొరుగుదేశమంటే సఖ్యతగా ఉండాలని..కానీ పాక్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ సరిహద్దులో టెన్షన్‌ వాతావరణం సృష్టిస్తోందన్నారు మంత్రి జయశంకర్‌. ప్రపంచంలో ఏ దేశమైనా పొరుగుదేశంలోకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందా అని ప్రశ్నించారు. […]

'పీవోకే' లొల్లి..పాక్ వర్రీ..తిప్పికొట్టిన భారత్!
Follow us
Pardhasaradhi Peri

| Edited By:

Updated on: Sep 19, 2019 | 8:51 AM

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఏదో ఒక రోజు భారత్‌లో అంతర్భాగమవుతుందన్న కేంద్రమంత్రి జయశంకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పాక్‌. భారత్‌  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని..దీన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా పరిగణించాలని కోరింది. ఇలాంటి ప్రకటనల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని చెప్పుకొచ్చింది.

పొరుగుదేశమంటే సఖ్యతగా ఉండాలని..కానీ పాక్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ సరిహద్దులో టెన్షన్‌ వాతావరణం సృష్టిస్తోందన్నారు మంత్రి జయశంకర్‌. ప్రపంచంలో ఏ దేశమైనా పొరుగుదేశంలోకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందా అని ప్రశ్నించారు. పీఓకే ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని..ఏదో ఒక రోజున దేశ భౌగోళిక పరిధిలోకి తీసుకొస్తామన్నారు. కశ్మీర్‌లో త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని పేర్కొన్నారు