Wrestlers Protest: ఢిల్లీ నడిబొడ్డున రెజ్లర్లు.. పోలీసుల బాహాబాహీ.. నేడు సుప్రీం కోర్టులో రెజ్లర్ల పిటిషన్ విచారణ
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్.. కొద్ది రోజులుగా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఏప్రిల్23 నుంచి రెజ్లర్లు ఆందోళన చేపట్టారు రెజ్లర్లు.

దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు, ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రెజ్లర్ల కోసం మడతపెట్టే పడకలను తీసుకువచ్చినందుకు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా నిరసన స్థలానికి వచ్చారు పోలీసులు చెబుతున్నారు. రెజ్లర్లు పోలీసుల వాగ్వాదంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసుల తీరుపై రెజ్లర్లు మండిపడ్డారు. యావత్ దేశం నుంచి మద్దతు అవసరమన్నారు రెజ్లర్ భజరంగ్ పూనియా. ప్రతి ఒక్కరూ ఢిల్లీకి రావాలన్నారు. పోలీసులు తమపై బలప్రయోగం చేస్తున్నారని, మహిళలను దూషించారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్.. కొద్ది రోజులుగా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఏప్రిల్23 నుంచి రెజ్లర్లు ఆందోళన చేపట్టారు రెజ్లర్లు. సింగ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రిజ్ భూషణ్ సింగ్ ఫిర్యాదుదారుల్లో ఒకరు మైనర్ కావడంతో సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను మరికాసేపట్లో సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు రెండు FIRలు నమోదు చేశారు. మరి ఇప్పుడు ఆయనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ తర్వాత పరిణామాలు ఎంటనేది ఆసక్తి నెలకొంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..