India-Canada Issue: కెనడాలో భారతీయ విద్యార్థులు.. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

కెనడా-భారత్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయబ్రాంతులకు గురవుతున్నారు. కెనడాలో జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులకు సాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ విద్యార్థుల కోసం ఏదైనా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

India-Canada Issue: కెనడాలో భారతీయ విద్యార్థులు.. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
Representative Image

Updated on: Sep 24, 2023 | 5:07 PM

కెనడా-భారత్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయబ్రాంతులకు గురవుతున్నారు. కెనడాలో జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులకు సాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ విద్యార్థుల కోసం ఏదైనా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే ఏవైనా సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్‌ను కూడా రిలీజ్ చేశారు.

నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిందని.. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా తన కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నట్లు భల్విందర్ సింగ్ తెలిపారు. నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోందని.. ఈ విషయంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలని కుల్‌దీప్ కౌర్ కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య వివాదం సృష్టించాయి. ఆ తర్వాత ఇరుదేశాలు కూడా ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఇరుదేశాలు దౌత్య వేత్తలను కూడా బహిష్కరించాయి. మరోవైపు కెనడా వీసాలను భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలన చేస్తున్నాయి. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ విషయంలో ఇంతవరకు జోక్యం చేసుకోకుండా ఆచి తూచి వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..