శాంతిభద్రతల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో బీహార్‌లో జరిగిన సంఘటనలు పదే పదే రుజువు చేస్తున్నాయి. సామాన్యులైనా, ప్రభుత్వ అధికారులైనా హింసకు, దాడులకు గురికాక తప్పదు. ఇప్పుడు మరో కేసులో పాట్నా జిల్లాలో మహిళా అధికారిపై దారుణంగా దాడి జరిగింది. బాధితురాలు రాష్ట్ర మైనింగ్ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారిణి. పాట్నాలోని బిహ్తా పట్టణంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలతో ఆ స్థలాన్ని సందర్శించిన ఆమెపై దాడి జరిగింది. ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న నిందితులు మహిళ అని కూడా చూడకుండా ఆమెను జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లి దాడికి పాల్పడ్డారు.
ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 44 మందిని అరెస్టు చేశామని, మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న పలువురిని అరెస్టు చేసేందుకు సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. బీహార్‌లోని పాట్నా జిల్లా బిహ్తా నగర్‌లో అక్రమ ఇసుక క్వారీ నడుస్తోంది. ఈ విషయం మహిళా అధికారిణి తెలుసుకుని అక్కడ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇసుక క్వారీలోని వ్యక్తులు మహిళా అధికారిని ఈడ్చుకెళ్లి దాడి చేశారు.
#WATCH | Bihar: Woman officer from mining department dragged, attacked by people allegedly involved in illegal sand mining in Bihta town in Patna district.
(Note: Abusive language; viral video confirmed by police)
44 people arrested, 3 FIRs filed while raids underway to arrest… pic.twitter.com/EtKW1oedG3
— ANI (@ANI) April 17, 2023
ఈ కేసులో ఇప్పటి వరకు 44 మందిని అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మహిళా అధికారిపై దాడికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు ధృవీకరించారు.
ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జిల్లా మైనింగ్ అధికారిపై సంఘవిద్రోహుల బృందం దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి 44 మందిని అరెస్టు చేశారు మరియు జిల్లా మైనింగ్ అధికారి మరియు ఇద్దరు మైనింగ్ ఇన్‌స్పెక్టర్లు సహా ముగ్గురు గాయపడినట్టుగా పాట్నా (పశ్చిమ) పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ తెలియజేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..