AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శృంగార మాత్రల డోస్ ఎక్కువై భర్త చనిపోయాడని చెప్పింది.. కట్ చేస్తే..

అయ్యో నా భర్త చనిపోయాడని ఏడుపు లఖించుకుంది. ఏం జరిగింది అంటే.. ఆ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకున్నాడు.. తేడా వచ్చి చనిపోయడాని చెప్పింది. అయితే సొంత సోదరిడకే ఆమె చెప్పే మాటలపై డౌట్ వచ్చింది. కాస్త క్రాస్ ఎంక్వైరీ చేస్తే.. తింగరి సమధానాలు చెప్పింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Viral: శృంగార మాత్రల డోస్ ఎక్కువై భర్త చనిపోయాడని చెప్పింది.. కట్ చేస్తే..
Romance Enhancing Drug
Ram Naramaneni
|

Updated on: Jan 24, 2025 | 7:45 PM

Share

కాన్పూర్‌లోని బితూర్‌లో ఒక మహిళ తన భర్తను హత్య చేసి.. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లుగా క్రియేట్ చేయడానికి యత్నించి అడ్డంగా చిక్కింది. బితూర్‌లోని ధ్రువ్ నగర్‌లో రంగుల రాట్నాలు నిర్వహించే అబిద్, జనవరి 18న చనిపోయినట్లు గుర్తించారు. శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరిచే డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల అబిద్ చనిపోయాడని అతని భార్య షబానా తన సోదరుడు సలీమ్‌కు సమాచారం అందించింది. అయితే అబిద్ మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులను గమనించిన సలీం అనుమానం వ్యక్తం చేశాడు. ప్రశ్నించగా షబానా తింగరి సమాధానాలు చెప్పింది. దీంతో డౌట్ వచ్చి సలీం తన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

ఔరయ్యలోని దిబియాపూర్‌కు చెందిన అబిద్, రెండు దశాబ్దాలుగా భార్యాపిల్లలతో కలిసి బితూర్‌లోని ధ్రువ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు, జాతరలలో పనిచేస్తున్నాడు. అతని అనుమానాస్పద మృతి తర్వాత, పోలీసులు అతని జేబులో ఎనిమిది శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు గుర్తించారు. అయితే పోస్టుమార్టంలో గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. విచారణలో షబానా తన ప్రేమికుడు రెహాన్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. షబానాను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. తమకు అడ్డు వస్తున్నాడనే భర్తను ఖతం చేసినట్లు తెలిపింది. వీరికి మరో వ్యక్తి వికాస్‌కు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ ముగ్గురూ అబిద్‌పై దాడి చేసి గొంతు పిసికి చంపారు. 

అయితే శృంగార సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకుని చనిపోయాడని నమ్మించేందుకు షబానా అబిద్ జేబులో ఆ ట్యాబ్లెట్లు పెట్టింది  ఓవర్‌డోస్‌ అయి చనిపోయినట్లుగా నమ్మించాలని స్కెచ్ వేసింది. కానీ సీన్ రివర్సయి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతుంది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!