కారడవిలో సడెన్‌గా మహిళకు పురిటినొప్పులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
మున్నార్‌కు చెందిన ఓ గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి యాలకులు కోయడానికి అడవికి వెళ్ళింది. ఈ పరిస్థితిలో ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు వచ్చాయి. అడవి కావడంతో ఏం చేయాలతో తెలియక భర్త కంగారుపడ్డాడు. చివరకు ఆరోగ్యసిబ్బందికి చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

గర్భంతో ఉన్నప్పుడు మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ టైమ్‌లో ప్రసవ నొప్పులు వస్తాయే తెలియదు కాబట్టి అనుక్షణం అలర్ట్‌గా ఉండాలి. ఇటీవలే రైల్లో గర్భిణీకి నొప్పులు రాగా.. ఓ ఆర్మీ డాక్టర్ సకాలంలో వైద్యం చేయడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. తాజాగా ఓ మహిళకు అడవిలో ప్రసవ నొప్పులు వచ్చాయి. అడవి కావడంతో ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. అడవిలో యాలకులు కోసుకుంటుండగా సదరు మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో అడవే ఆస్పత్రిగా మారగా.. అక్కడే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కేరళలో జరిగింది. ఆరోగ్య సిబ్బంది సహాయంతో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.
కేరళలోని వండిపెరియార్ ప్రాంతానికి చెందిన సురేష్ అనే దినసరి కూలీ, అతని భార్య బిందుతో కలిసి యాలకులు కోయడానికి వల్లకడవు అటవీ ప్రాంతానికి వెళ్లారు. బిందు గర్భవతి అయినప్పటికీ పని కోసం అడవిలోకి వెళ్లక తప్పలేదు. అయితే ఏలకులు కోస్తుండగానే ఆమెకు ప్రసవ నొప్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. అడవి కావడంతో ఆసుపత్రికి వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో భర్త కంగారుపడ్డాడు. కాసేపు ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు.
తల్లీబిడ్డ క్షేమం
చివరకు సురేష్ ఫోన్‌లో ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. దీంతో ఆమె నొప్పులతో తల్లడిల్లింది. ఈ క్రమంలో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకోక ముందే ఆ మహిళ అడవిలోనే తన మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. చివరకు ఆరోగ్య సిబ్బంది తల్లి, బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, వండిపెరియార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కష్ట సమయంలో ధైర్యంగా అడవిలో బిడ్డకు జన్మనిచ్చిన బిందు ధైర్యాన్ని అందరూ అభినందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




