Uttar Pradesh: అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది.. ఇంట్లోనే గుంత తవ్వి పూడ్చిపెట్టింది.. ఆపై ప్రియుడితో కలిసి..
రోజురోజుకు పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. పరాయి మోజులో పడి సొంత వాళ్లనే కడ తేరుస్తున్నారు. చేస్తోంది తప్పు.. వద్దని వారిస్తే చాలు కోపం పెంచుకుంటున్నారు. జాగ్రత్తలు...
రోజురోజుకు పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. పరాయి మోజులో పడి సొంత వాళ్లనే కడ తేరుస్తున్నారు. చేస్తోంది తప్పు.. వద్దని వారిస్తే చాలు కోపం పెంచుకుంటున్నారు. జాగ్రత్తలు చెప్పినా వార్నింగ్ ఇస్తున్నారనే కసితో రగిలిపోతున్నారు. కోపంలో హత్యలు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతదేహం ఆనవాళ్లు తెలియకుండా ఇంట్లోనే ఏడు అడుగుల లోతు గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టింది. ఆ తర్వాత అదే ఇంట్లో ప్రియుడితో కలిసి ఉండటం స్టార్ట్ చేసింది. బంధువులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో వారిపైనే రివర్స్ కేసు పెట్టింది. ముందు మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారణ జరపగా సంచలన విషయాలు తెలిశాయి.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పరిధిలో చంద్రవీర్, సవిత దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం సవితకు అరుణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న చంద్రవీర్ భార్యను పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని సవిత ప్లాన్ వేసింది. ప్రియుడు అరుణ్ తో కలిసి కుట్ర పన్నింది. వీరిద్దరూ కలిసి చంద్రవీర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం పోలీసుల దర్యాప్తులో దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని చంద్ర వీర్ ఇంట్లోనే పూడ్చారు. ఏడు అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. తర్వాత పైన సిమెంట్ ప్లోరింగ్ వేశారు. ఈ ఘటన 2018 లో జరిగింది. చంద్రవీర్ కనిపించకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అతని గురించి ఆరా తీశారు. దీంతో సవిత తన భర్తను బంధువులు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
2018 నుంచి ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. అతని గురించి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా లభించిన కొన్ని ఆధారాల ద్వారా లోతుగా దర్యాప్తు చేయగా ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రవీర్ భార్య సవితపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో తాను తన ప్రియుడితో కలిసి చంద్రవీర్ ను హత్య చేసినట్లు సవిత అంగీకరించింది. దీంతో పోలీసులు వారిని జైలుకి తరలించారు. చంద్రవీర్ చనిపోయిన తర్వాత అతని భార్య సవిత, తన అదే ఇంట్లో ప్రియుడు అరుణ్ తో కలిసి నివాసముండడం అందరినీ షాక్ కు గురి చేసింది. హత్యకు ఉపయోగించిన తుపాకీ, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..