దేశంలో శాంతి కోసం ఏ ‘రోల్’ అయినా పోషిస్తా.. తలైవా

సూపర్ స్టార్ రజినీకాంత్ గ్లామరస్ వరల్డ్ నుంచి తరచూ రియల్ వరల్డ్ లోకి వస్తున్నారు. ఢిల్లీలో మత ఘర్షణలను ఖండిస్తూ ప్రకటనలు చేసిన 'బాషా'.. దేశంలో శాంతి నెలకొనేలా చూసేందుకు ఏ పాత్ర అయినా పోషించేందుకు తాను సిధ్ధంగా ఉన్నానన్నారు.

దేశంలో శాంతి కోసం ఏ 'రోల్' అయినా పోషిస్తా.. తలైవా
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 02, 2020 | 10:50 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ గ్లామరస్ వరల్డ్ నుంచి తరచూ రియల్ వరల్డ్ లోకి వస్తున్నారు. ఢిల్లీలో మత ఘర్షణలను ఖండిస్తూ ప్రకటనలు చేసిన ‘బాషా’.. దేశంలో శాంతి నెలకొనేలా చూసేందుకు ఏ పాత్ర అయినా పోషించేందుకు తాను సిధ్ధంగా ఉన్నానన్నారు. ఓ ముస్లిం సంస్థకు చెందిన పెద్దలు ఆదివారం తనను తన నివాసంలో కలిసిన అనంతరం ఆయన ఈమేరకు ట్వీట్ చేశారు. ‘ప్రేమ, సమైక్యత’, ‘శాంతి’ దేశ ప్రధాన ధ్యేయంగా ఉండాలన్న ఈ ముస్లిం నేతల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని రజినీకాంత్ పేర్కొన్నారు. తమిళనాడులోని ‘జమాతుల్ ఉమా సబయ్’ అనే ముస్లిం సంస్థకు చెందిన నేతలు ఆదివారం  రజినీని కలుసుకుని.. సీఏఏ నేపథ్యంలో తమ వర్గం ప్రయోజనాలను పరిరక్షించేలా చూడాలని అభ్యర్థించారు. ఇందుకు ఆయన.. తన శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఇటీవల చెలరేగిన హింసను ఉక్కుపాదంతో అణచివేయాలని ఈ సూపర్ స్టార్ గతవారం ఓ ట్వీట్ లో కోరిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న నేతలు హింసను అదుపుచేయలేకపోతే తక్షణమే రాజీనామా చేయాలని  కూడా  ఆయన డిమాండ్ చేశారు.

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..