Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Trains : విద్యుత్‌తో నడిచే ట్రైన్‌లలో ఎందుకని రైలు అంతటా కరెంట్‌ వ్యాపించదు?

ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రైళ్లు బొగ్గుతో నడిచేవి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఇంజన్లతో నడిచే రైళ్లు తయారు చేశారు. దీంతో రైళ్లు పట్టాలపై విద్యుత్తుతో నడవడం ప్రారంభించాయి. రైలుకు విద్యుత్ తీగల నుంచి నేరుగా కరెంట్ వస్తుందని మనందరికీ తెలుసు. దాని కారణంగా అది పట్టాలపై స్పీడ్‌గా పరుగెత్తుతుంది. అయితే విద్యుత్తు తీగల ద్వారా కరెంట్ వచ్చినప్పుడు రైలులో కూర్చున్న వారికి కరెంట్ షాక్‌ ఎందుకు కొట్టదు? అనే ప్రశ్న మీకెప్పుడైనా తలెత్తిందా..

Electric Trains : విద్యుత్‌తో నడిచే ట్రైన్‌లలో ఎందుకని రైలు అంతటా కరెంట్‌ వ్యాపించదు?
Trains
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 06, 2023 | 9:09 PM

ఢిల్లీ, డిసెంబర్ 6: ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రైళ్లు బొగ్గుతో నడిచేవి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఇంజన్లతో నడిచే రైళ్లు తయారు చేశారు. దీంతో రైళ్లు పట్టాలపై విద్యుత్తుతో నడవడం ప్రారంభించాయి. రైలుకు విద్యుత్ తీగల నుంచి నేరుగా కరెంట్ వస్తుందని మనందరికీ తెలుసు. దాని కారణంగా అది పట్టాలపై స్పీడ్‌గా పరుగెత్తుతుంది. అయితే విద్యుత్తు తీగల ద్వారా కరెంట్ వచ్చినప్పుడు రైలులో కూర్చున్న వారికి కరెంట్ షాక్‌ ఎందుకు కొట్టదు? అనే ప్రశ్న మీకెప్పుడైనా తలెత్తిందా.. రైలు అంతటా కరెంట్ వ్యాపించకుండా నిరోధించే భాగం ఏది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసుకుందాం..

రైళ్లలో కరెంట్ ఎందుకు వ్యాపించదంటే?

ఇనుముతో చేసిన ఈ రైలులో కరెంట్ ఎందుకు వ్యాపించదు అనే ప్రశ్న బహుశా రైలులో కూర్చున్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. వాస్తవానికి, రైలు ఇంజిన్ విద్యుత్ తీగల నుండి పొందే కరెంట్ నేరుగా కాకుండా పాంటోగ్రాఫ్ ద్వారా అందుకోవడం వల్ల ఇది జరుగుతుంది. పాంటోగ్రాఫ్ అనేది రైలు ఇంజిన్ పైభాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది నేరుగా విద్యుత్ తీగలకు అంటుకొని ఉంటుంది. అందువల్లనే రైలు అంతటికి కరెంట్ వ్యాపించదు. ఇది ఇంజిన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన పాంటోగ్రాఫ్ విద్యుత్ వైర్‌లతో ప్రత్యక్ష కనెక్షన్‌ కలిగి ఉంటుంది. ఇంజిన్ బాడీలో కరెంట్ వ్యాప్తి చెందకుండా నిరోధించే పాంటోగ్రాఫ్ క్రింద ఇన్సులేటర్లు ఉంటాయి.

ఇండియన్ రైళ్లు విదేశాలకు కూడా వెళ్తాయి

భారతీయ రైళ్లు భారతదేశంలోనే కాకుండా, కొన్ని రైళ్లు విదేశాలకు కూడా వెళ్తాయి. వీటిలో మైత్రి ఎక్స్‌ప్రెస్, బంధన్ ఎక్స్‌ప్రెస్, మిథాలీ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. మైత్రి ఎక్స్‌ప్రెస్ గురించి రైలు భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య నడుస్తుంది. ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకాకు వెళుతుంది. బంగ్లాదేశ్ – భారతదేశం మధ్య బంధన్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. ఈ రైలు 2017లో ప్రారంభమైంది. మిథాలీ ఎక్స్‌ప్రెస్ గురించి చెప్పాలంటే.. ఈ రైలు భారతదేశంలోని జల్పైగురిలోని సిలిగురి నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా వరకు నడుస్తుంది. ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video