Pranab My Father: జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కూతురి పుస్తకం
ప్రణబ్ ముఖర్జీ జీవితంపై ఆయన కూతురు శర్మిష్ఠ రాసిన పుస్తకం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాను ప్రధాని కాకుండా సోనియాగాంధీ అడ్డుపడ్డినట్లు ప్రణబ్ ముఖర్జీ తనతో చెప్పారని షర్మిష్ఠ ఈ పుస్తకంలో రాశారు. పదవినే ఆశించనపుడు, అసంతృప్తే ఉండదని తన తండ్రి చెప్పినట్లు షర్మిష్ట రాశారు.

ప్రణబ్ ముఖర్జీ జీవితంపై ఆయన కూతురు శర్మిష్ఠ రాసిన పుస్తకం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాను ప్రధాని కాకుండా సోనియాగాంధీ అడ్డుపడ్డినట్లు ప్రణబ్ ముఖర్జీ తనతో చెప్పారని షర్మిష్ఠ ఈ పుస్తకంలో రాశారు. పదవినే ఆశించనపుడు, అసంతృప్తే ఉండదని తన తండ్రి చెప్పినట్లు షర్మిష్ట రాశారు.. అలాగే రాహుల్‌గాంధీ రాజకీయంగా పరిణతి చెందలేదనీ, ఆయన పార్లమెంటుకు రెగ్యులర్‌గా రాకపోవడంపై తన తండ్రికి నచ్చకపోయేదన్నారు.
ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో శర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రాశారు . బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన విషయాలు, ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. అందులో నెహ్రూ-గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు.. ఇలా పలు ఆసక్తికర అంశాలను వివరించారు.
సోనియా,రాహుల్‌పై ప్రణబ్ చెప్పిన విషయాలను వివరించారు. రాహుల్ గురించి అభిప్రాయాలను డైరీలో రాసుకున్న ప్రణబ్.. తనను ప్రధాని కాకుండా సోనియా అడ్డుకున్నారంటూ పేర్కొన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబాల అహంకారమంతా రాహుల్‌కు వచ్చింది. కానీ వారి రాజకీయ చతురతే ఆయనకు అబ్బలేదు.. అని రాసుకున్నారని షర్మిష్ట తన పుస్తకంలో పేర్కొన్నారు.

Sharmishtha Mukherjee
ఇలా.. ప్రణబ్ మై ఫాదర్” పుస్తకంలో శర్మిష్ఠ ముఖర్జీ తన తండ్రి రాహుల్ గాంధీపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను, గాంధీ కుటుంబంతో ఆయనకున్న సంబంధాలను పంచుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..