Lawrence bishnoi: అసలెవరీ లారెన్స్ బిష్ణోయ్.. ఆయన నేర చరిత్ర ఏంటి..
బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న జన్మించాడు. అతని స్వస్థలం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ధత్తరన్‌వాలి గ్రామం. తండ్రి హర్యానా పోలీసు శాఖలో కానిస్టేబుల్. లారెన్స్ పుట్టిన నాలుగేళ్లకు(1997లో) తండ్రి పోలీసు శాఖను వదిలి వ్యవసాయం బాట పట్టారు. బిష్ణోయ్ 12వ తరగతి వరకు పంజాబ్- హర్యానా- రాజస్థాన్...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు.. కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి బిష్ణోయ్ అంశం తెరపైకి వచ్చింది. ఇంతకీ అసలెవరీ లారెన్స్ బిష్ణోయ్. ఆయన నేర చరిత్ర ఏంటి.? ప్రస్తుతం జైల్లో ఉన్న బిష్ణోయ్ నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో ఇప్పుడు తెలుసుకుందాం..
బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న జన్మించాడు. అతని స్వస్థలం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ధత్తరన్‌వాలి గ్రామం. తండ్రి హర్యానా పోలీసు శాఖలో కానిస్టేబుల్. లారెన్స్ పుట్టిన నాలుగేళ్లకు(1997లో) తండ్రి పోలీసు శాఖను వదిలి వ్యవసాయం బాట పట్టారు. బిష్ణోయ్ 12వ తరగతి వరకు పంజాబ్- హర్యానా- రాజస్థాన్ సరిహద్దులోని అబోహర్ అనే చిన్న పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం పైచదవుల కోసం 2010లో చండీగఢ్‌కు వెళ్లి డీఏవీ కాలేజీలో చేరాడు. అక్కడే అతని నేర సామ్రాజ్యానికి తొలి అడుగు పడింది.
డీఏవీ కళాశాలలో చేరిన తరువాత బిష్ణోయ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2011-12 మధ్య పంజాబ్ విశ్వవిద్యాలయం (SOPU) విద్యార్థి సంస్థ అధ్యక్షుడయ్యాడు. అక్కడే అతనికి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. అతని అండదండలతో అనతికాలంలోనే యూనివర్శిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ సమయంలోనే అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.
మోకా చట్టంలో అరెస్టైన బిష్ణోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బిష్ణోయ్ నేర సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది. ఈ గ్యాంగ్‌లో ఏకంగా 700 మంది సభ్యులు ఉన్నారు. ఖలిస్తాన్ ఉద్యమంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలను బిష్ణోయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్ బహిరంగానే ప్రకటన చేశాడు. కృష్ణ జింకను చంపిన ఆరోపణల నేపథ్యంలో బెదిరింపులకు దిగాడు. దీంతోనే సల్మాన్‌కి ప్రభుత్వం వై+ భద్రతను కలిగించింది.
ఇక లారెన్స్ బిష్ణోయ్ యొక్క క్రిమినల్ సిండికేట్ మే 2022లో పంజాబీ కళాకారుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గోల్డీ బ్రార్ కాల్పులకు బాధ్యత వహించగా, బిష్ణోయ్ ప్రత్యక్ష ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిష్ణోయ్‌పై హత్య, దోపిడీతో సహా రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..