AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో టాప్ టెర్రరిస్ట్‌తో పాక్ సైన్యం

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని పలు ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదుల అంత్యక్రియలకు అక్కడి ఆర్మీ ఉన్నత అధికారులు హాజరయిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. టాప్ LeT కమాండర్ అబ్దుల్ రవూఫ్‌తో కలిసి వారు టెర్రరిస్టుల మృతదేహాలకు నివాళి అర్పిస్తున్నారు.

Pakistan: ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో టాప్ టెర్రరిస్ట్‌తో పాక్ సైన్యం
Pakistani Soldiers
Ram Naramaneni
|

Updated on: May 07, 2025 | 7:53 PM

Share

ఇంత జరుగుతున్నా.. పాక్‌ బుద్ధి మారడంలేదు. వారిలో రియలైజేషనే లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని భారత్‌ మొత్తుకుంటున్నా.. మాదీ ఉగ్ర బాధిత దేశమే అంటూ బుకాయిస్తోంది పాకిస్తాన్‌.  ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ముష్కరులను అంతమొందించింది భారత్‌. ఆ ముష్కరుల మృతదేహాలకు పాకిస్తాన్‌ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం తొలి తప్పిదం. ఆ అంత్యక్రియల్లో ప్రధానంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరో ప్రపంచం అంతటికీ తెలుసు. లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ హఫీజ్‌ అబ్దుల్‌ రౌఫ్‌. అవును ఉగ్రవాదులు, పాక్‌ సైనికులు కలిసే ఈ అంత్యక్రియలు చేస్తున్నారంటే.. ఆ దేశంలో నరనరాన ముష్కర రక్తం పారుతోందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్‌ ఆర్మీ టెర్రరిస్టును పెంచి పోషిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌పై మసూద్‌ అజ్హార్ తీవ్ర ఆక్రోశం

– ఆపరేషన్ సిందూర్‌తో నామరూపాల్లేకుండా పోయింది జైషే మహ్మద్‌. భారత్‌ రివెంజ్‌ ఎటాక్‌లో మసూద్ అజ్హార్ కుటుంబంలో మొత్తం హతమయ్యింది. ఈ దాడిలో మసూద్ అజ్హార్ సోదరి, మౌలానా కషాఫ్ కుటుంబంతో కలిపి మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడిలో తాను చనిపోతే బాగుండని ఏడుపు లంకించుకున్నాడు మసూర్‌ అజ్హార్. అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు… మోదీపై విషం కక్కుతూ ఓ లేఖ కూడా విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెల్లగక్కారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం… ఇకపై జాలి చూపను అంటూ మసూద్‌ బీరాలు పోయాడు.

– అయితే మసూర్ అజ్హార్ ఇప్పుడెక్కడున్నాడు…? ఎప్పుడూ హై సెక్యూరిటీ కల్పించే పాకిస్థాన్‌ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా…? లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియాల్సింది ఉంది. ఇటు మసూర్ అజ్హార్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సంచలన పోస్ట్‌ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. పిక్చర్‌ అబీ బాకీ హై… సినిమా అప్పుడే అయిపోలేదంటూ ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. మనోజ్‌ ముకుంద్ కామెంట్స్‌ వెనుక అంతరార్థం ఏంటన్న చర్చ నడుస్తోంది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్