AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు‌ అంత ప్రత్యేకత ఏమిటి..? గోల్డ్‌ సర్టిఫికేషన్‌ రావడానికి కారణం ఏమిటి.?

దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది రైల్వే శాఖ. దేశంలో ఒక్కో రైల్వే స్టేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది....

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు‌ అంత ప్రత్యేకత ఏమిటి..? గోల్డ్‌ సర్టిఫికేషన్‌ రావడానికి కారణం ఏమిటి.?
Subhash Goud
|

Updated on: Mar 05, 2021 | 2:47 AM

Share

దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది రైల్వే శాఖ. దేశంలో ఒక్కో రైల్వే స్టేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌కు ఉన్న ప్రత్యేకతలే ఆ స్టేషన్‌కు గోల్డ్‌ సర్టిఫికేషన్‌ వచ్చేలా చేశాయి. సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో నడిచే రైల్వే స్టేషన్‌.. అత్యాధునిక హంగులతో పాటు పర్యావరణానికి మేలు చేసేలా, ప్రయాణికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తోంది. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ట్రీ ఇచ్చిన రేటింగ్స్‌ ప్రకారం మహారాష్ట్రలో గోల్డ్‌ సర్టిఫికేషన్‌ పొందిన మొదటి రైల్వే స్టేషన్‌గా నిలిచింది. ఈ రైల్వే స్టేషన్‌లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రయాణికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం, ఈ స్టేషన్‌లో పలు ప్రత్యేకతల కారణంగా గోల్డ్‌ సర్టిఫికేషన్‌ పొందగలిగింది.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు ఉన్న ప్రత్యేతలు

► వాహనాల పార్కింగ్‌ ప్రదేశంలో ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు.  ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతోంది.

► మొత్తం స్టేషన్‌లో15 శాతం చెట్లు, చిన్న చిన్న పార్కులు, లాక్‌ను ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటని ఆర్గానిక్‌ పద్దతుల్లో పెంచుతున్నారు.

► స్టేషన్‌లో మొత్తం 100 శాతం శాతంఎల్‌ ఎల్‌ఈడీలను అమర్చారు.

► సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

► ప్రతి చోట బీఎల్‌ బీఎల్‌డీసీ, హెచ్‌వీఎల్‌ఎస్‌ ఫ్యాన్స్‌ను అమర్చారు.

► స్టేషన్‌లో ఉన్న వివిధ కార్యాలయాలు, వెయిటింగ్‌ హాళ్లలో ఎక్కువ సెన్సార్లు ఉపయోగించారు.

► ఎలివేటర్లు, ప్లాట్‌ఫామ్‌లు, స్టేషన్‌ ఏరియా, ట్రాక్స్‌, రూఫ్‌ టాప్‌లు, పార్కింగ్‌ ప్రాంతం, వెయిటింగ్‌ హాల్‌, షట్టర్స్‌, ఇతర వాటిని శుభ్రం చేసేందుకు మెషీన్లను ఏర్పాటు చేశారు.

► స్టేషన్‌లో శుభ్రం చేయడానికి బయో డీగ్రేడబుల్‌,ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్‌ను మాత్రమే ఉపయోగిస్తారు.

► స్టేషన్‌లో మొత్తం 245 కిలోవాట్ల సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు.

► వైఫై,పర్యాటక సమాచారం, అటోమేటివ్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్ల, ఫార్మసీ, వైద్య సదుపాయం, ఆహారం ఇలా ఎన్నో రకాల సదుపాయాలు కల్పించారు. అలాగే పర్యావరణానికి హానీ చేసే ప్లాస్టిక్‌ బ్యాగులను వినియోగించవద్దని రైల్వే స్టేషన్‌లలో ప్రకటనలు కనిపిస్తాయి.

ఇవీ చదవండి :

PF Account Balance: ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్) బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా..? నాలుగు సులభమైన మార్గాలు

mAadhaar App: మీ మొబైల్‌లో ఎంఆధార్‌ యాప్‌ ఉందా..? ఈ యాప్‌ ద్వారా 35 రకాల ఆధార్ సేవలు