Train Death: వామ్మో దారుణం.. ట్రైన్ లో తనకు తానే తుపాకితో కాల్చుకుని చనిపోయాడు
పశ్చిమ బెంగాల్ లోని ఓ రైలులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనను తాను తుపాకితో కాల్చుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడు ఎక్కాడు.

పశ్చిమ బెంగాల్ లోని ఓ రైలులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనను తాను తుపాకితో కాల్చుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. న్యూ జల్పైగురి స్టేషన్ సమీపానికి రాగానే జనరల్ కంపార్ట్ మెంట్ లో ఉన్న ఆ ప్రయాణికుడు తనకు తానే తుపాకితో కాల్చుకుని చనిపోయాడు.ఈ ఘటన సోమవారం రోజున రాత్రి 8 గంటలకు జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకున్నారు.
అయితే అలా కాల్చుకున్న వ్యక్తి ఎవరో ఇంకా గుర్తించలేదని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. అతను వద్ద టిక్కెట్ కూడా లేదని.. అతని ఆధారాలతో కూడిన పత్రాలు లేవని పేర్కొన్నారు. అలాగే న్యూ జల్పైగురి స్టేషన్ నుంచి అతను ఎక్కిన కోచ్ ను కూడా రైలు నుంచి వేరుచేశామని.. ఫారెన్సిక్ విచారణ ప్రారంభించామని తెలిపారు. అయితే ఆ బాధితుడు తుపాకితో ఏ ప్రాంతంలో రైలు ఎక్కడో కూడా స్పష్టత లేదని వెల్లడించారు. అతనెవరు, ఎందుకిలా చేసుకున్నాడనే విషయాలను రాబట్టేందుకు ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








