AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: సచిన్ పైలట్ దీక్ష.. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ వార్నింగ్.. రాజస్థాన్‌లో అసలేం జరుగుతుందంటే..

మరోసారి రాజస్థాన్ కాంగ్రెస్‌లో పోరు..సీఎం అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్‌గా మారింది..బీజేపీ హయంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ గెహ్లాట్‌ను ప్రశ్నించిన పైలట్‌..సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ దీక్ష చేపట్టారు.. ఇదే చర్య అంటూ పార్టీ ప్రశ్నించినా పైలట్ వినిపించుకోకుండా దీక్ష చేస్తున్నారు.

Rajasthan: సచిన్ పైలట్ దీక్ష.. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ వార్నింగ్.. రాజస్థాన్‌లో అసలేం జరుగుతుందంటే..
Sachin Pilot
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2023 | 12:43 PM

Share

మరోసారి రాజస్థాన్ కాంగ్రెస్‌లో పోరు..సీఎం అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్‌గా మారింది..బీజేపీ హయంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ గెహ్లాట్‌ను ప్రశ్నించిన పైలట్‌.. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ దీక్ష చేపట్టారు. ఇదే చర్య అంటూ పార్టీ ప్రశ్నించినా పైలట్ వినిపించుకోకుండా దీక్ష చేస్తున్నారు.

పైలట్‌ నిరాహారదీక్ష సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జైపూర్‌లోని అమరవీరుల స్మారకం వద్ద పైలట్ నిరాహార దీక్ష జరుగుతోంది. అయితే గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేయడం ఇదే తొలిసారి. మరోవైపు పైలట్ తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

అశోక్ గెహ్లాట్ పై పోరును సచిన్ పైలట్ మరోసారి మొదలుపెట్టారు. 2018 వరకు అధికారంలో ఉన్న వసుంధర రాజే ప్రభుత్వ అవినీతి, మోసాలపై అశోక్ గెహ్లాట్ ఎందుకు మౌనం వహిస్తున్నారని పైలట్ ప్రశ్నించారు. ఆ స్కామ్‌లపై చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని లేవనెత్తుతూ పైలట్ నిరాహారదీక్షను ప్రకటించారు. ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లోని సీఎం అశోక్‌ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ పైలట్ నిరాహారదీక్షకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధిష్టానం హెచ్చరించినా లెక్కచేయకుండా దీక్ష చేయడం చర్చకు దారితీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
డీజే సౌండ్‌తో జాగ్రత్త.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి..
డీజే సౌండ్‌తో జాగ్రత్త.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి..
నిమ్మకాయ లేకుండా లెమన్ టీ.. 2 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి..
నిమ్మకాయ లేకుండా లెమన్ టీ.. 2 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి..
కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధులకు రామబాణం..ప్రకృతి ప్రసాదం
కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధులకు రామబాణం..ప్రకృతి ప్రసాదం
Women’s Asia Cup 2026: థాయిలాండ్ ఔట్.. భారత్ సెమీస్ లెక్కలివే..?
Women’s Asia Cup 2026: థాయిలాండ్ ఔట్.. భారత్ సెమీస్ లెక్కలివే..?
కారు బ్యాటరీ మధ్యలోనే పాడైపోయిందా? నిమిషాల్లోనే జంప్-స్టార్ట్..!
కారు బ్యాటరీ మధ్యలోనే పాడైపోయిందా? నిమిషాల్లోనే జంప్-స్టార్ట్..!
ఫోన్ బ్యాటరీ నిలబడాలంటే ఇలా చేసి చూడండి
ఫోన్ బ్యాటరీ నిలబడాలంటే ఇలా చేసి చూడండి
రూ.20వేల లోపు సూపర్ ఫీచర్లతో వస్తున్న ఫోన్లు ఇవే
రూ.20వేల లోపు సూపర్ ఫీచర్లతో వస్తున్న ఫోన్లు ఇవే
చాణక్య నీతి : ఈ పురుషులు మాత్రమే భూమిపై స్వర్గసుఖాలు అనుభవిస్తారు
చాణక్య నీతి : ఈ పురుషులు మాత్రమే భూమిపై స్వర్గసుఖాలు అనుభవిస్తారు
వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు..!
వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు..!
విశాఖలో 'అహనా పెళ్ళంట' కోడి సీన్.. ఎందుకో తెలుసా..!
విశాఖలో 'అహనా పెళ్ళంట' కోడి సీన్.. ఎందుకో తెలుసా..!