AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengal Municipal Polls: బెంగాల్ మున్సిపల్‌లో దుమ్మురేపిన మమతా.. ఎఫెక్ట్ చూపించని బీజేపీ, కాంగ్రెస్

West Bengal Municipal Election Results: పశ్చిమ బెంగాల్‌‌లో మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలిచిన బీజేపీ

Bengal Municipal Polls: బెంగాల్ మున్సిపల్‌లో దుమ్మురేపిన మమతా.. ఎఫెక్ట్ చూపించని బీజేపీ, కాంగ్రెస్
Tmc
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2022 | 8:55 AM

Share

West Bengal Municipal Election Results: పశ్చిమ బెంగాల్‌‌లో మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలిచిన బీజేపీ అంతలా ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంత ప్రభావం చూపింది? మిగతా పార్టీల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం.. గతేడాది బెంగాల్‌‌లో జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ పార్టీ టీఎంసీ జయకేతనం ఎగరేసింది. ఆ ఎన్నికలు జరిగిన పది నెలల తర్వాత నిర్వహించిన స్థానిక సంస్థల ఎలక్షన్లలోనూ అఖండ విజయం సాధించింది (TMC) తృణమూల్ కాంగ్రెస్. చాలాచోట్ క్లీన్​స్వీప్ చేసింది అధికార పార్టీ. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటీలలో 102 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది మమతా బెనర్జీ సైన్యం. 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ (BJP) ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేదు. ఇక కాంగ్రెస్ అయితే, సున్నాకే చాపచుట్టేసింది. వామపక్షాలు కూడా ఘోరంగా పరాజయం పాలయ్యాయి. దాదాపు 27మున్సిపాలిటీల్లో విపక్షాలు అసలు ఖాతాలే తెరవకపోవడం గమనార్హం. ఈ ఫలితాలు సువేందు అధికారికి ఎదురుదెబ్బేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక్కడిదాకా లెక్కలు ఒకలా ఉంటే, ఓ కొత్త రాజకీయ పార్టీ అనూహ్య విజయాలను సాధించింది. కొత్తగా ఏర్పాటైన హమ్రో పార్టీ, డార్జీలింగ్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. డార్జీలింగ్‌లో ఆధిపత్యం సాగించే గూర్ఖా జన్ముక్తి మోర్చా, టీఎంసీ, బీజేపీని ఓడించి.. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అటు మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు టీఎంసీ చీఫ్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ. అనూహ్య మెజారిటీతో గెలిపించినందుకు.. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విజయంతో తమ బాధ్యత పెరిగిందన్నారు మమతా బెనర్జీ. రాష్ట్రంలో శాంతి సుస్థిరతలు పెంపొందించి, అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. అటు ఘోర వైఫల్యంపై దృష్టిపెట్టింది కమలం పార్టీ. ఒక్కచోట ప్రభావం చూపకపోవడంపై ఆరా తీస్తున్నారు బీజేపీ కీలక నేతలు. ఎక్కడ వైఫల్యం చెందామనే చర్చలు జరుగుతున్నాయి.

Also Read:

UP Assembly Election 2022 Voting Phase 6 Live: అందరిచూపు సీఎం సీటు వైపే.. యూపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బంధీలుగా భారతీయ విద్యార్థులు.. రష్యా కీలక ప్రకటన