వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ గుండెపోటుతో మృతి
వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోమెన్ మిత్రా మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురవ్వడంతో..
వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోమెన్ మిత్రా మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురవ్వడంతో.. ఆయన కుటుంబ సభ్యులు కోల్‌కతా నగరంలోని ఆస్పత్రిలో చేర్చారు. కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఉండటంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై మరణించారు. ఇక ముందస్తు జాగ్రత్తగా ఆయనకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రిపోర్టులో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. సోమెన్ చౌరంగీ జిల్లా సీల్దాహ్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా సేవలందించారు. సోరెన్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలప్ ఘోష్ సోరెన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
West Bengal Congress President Somen Mitra passes away at a hospital in Kolkata. pic.twitter.com/afnzWcoJSG
— ANI (@ANI) July 29, 2020
Read More