దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 52,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 10,20,582 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం దేశంలో 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 775 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 34,968 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Single-day spike of 52,123 positive cases & 775 deaths in India in the last 24 hours.
Total #COVID19 positive cases stand at 15,83,792 including 5,28,242 active cases, 10,20,582 cured/discharged & 34,968 deaths: Health Ministry https://t.co/ZakSSmhbNf pic.twitter.com/H5ktC0mvs7
— ANI (@ANI) July 30, 2020
Read More