Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee – PM Modi: మోదీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..? మరి తింటారా..? ప్రధానికి సీఎం మమతా ఆఫర్.. బీజేపీ ఫైర్..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కోసం ఏదైనా వండడానికి సిద్ధంగా ఉన్నానని.. అయితే ప్రధానమంత్రి దానిని రుచి చూడటానికి సిద్ధంగా ఉంటారో..? లేదో.. తెలియదంటూ.. వ్యాఖ్యానించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం తగదంటూ మమతా బెనర్జీ బిజెపికి చురకలంటించారు. న

Mamata Banerjee - PM Modi: మోదీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..? మరి తింటారా..? ప్రధానికి సీఎం మమతా ఆఫర్.. బీజేపీ ఫైర్..
Mamata Banerjee Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: May 15, 2024 | 1:45 PM

Share

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కోసం ఏదైనా వండడానికి సిద్ధంగా ఉన్నానని.. అయితే ప్రధానమంత్రి దానిని రుచి చూడటానికి సిద్ధంగా ఉంటారో..? లేదో.. తెలియదంటూ.. వ్యాఖ్యానించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం తగదంటూ మమతా బెనర్జీ బిజెపికి చురకలంటించారు. నవరాత్రుల సందర్భంగా బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేపలు తింటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే.. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.. నవరాత్రుల సమయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాంటూ ఆరోపించారు. ఈ విషయంపై తాజాగా.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తేజస్విపై విరుచుకుపడ్డారు. నవరాత్రులలో కొంతమంది హిందువులు మాంసాహారానికి దూరంగా ఉన్న కాలంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ చేపలు తింటున్నారని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. “ప్రధాని కోరుకుంటే, నేను ఆయనకు వండి పెట్టగలను. ఆయన నేను చేసిన వంట తింటారో..? లేదో తెలియదు.. కానీ.. చిన్నప్పటి నుంచి మంచిగా వంట చేస్తాను. నా వంటను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే మోదీజీ నేను వండిన ఆహారం తింటారా? వారు నన్ను నమ్మితే.. ఆయనకు ఏది నచ్చితే అది వండుతాను.. తింటారా?” అంటూ మమతా పేర్కొన్నారు.

తనకు ఢోక్లా వంటి శాఖాహారం ఎంత ఇష్టమో, చేపల పులుసు కూడా అంతే ఇష్టమంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. హిందువులలోని వివిధ వర్గాలకు వారి సొంతత నియమాలు ఉన్నాయని.. వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయన్నారు. ఎవరు ఏం తింటారో తేల్చడానికి బీజేపీ ఎవరు? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి అత్యుత్తమ ఉదాహరణ.. బీజేపీ నేతలకు ఎంత తక్కువ అవగాహన ఉందో దీన్నిబట్టి తెలుస్తోంది.. అంటూ విమర్శించారు

ప్రధానికి ఆహారం వండిపెడతానన్న మమతా బెనర్జీ వ్యాఖ్యాలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. “మోదీ జీకి చేపలు.. తినిపించాలనుకుంటున్నారు.. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా ప్రధానిని ఆహ్వానించారు. ప్రధాని శాకాహారుడని, చేపలు లేదా మరే ఇతర మాంసాహారం తినరని ఆమెకు బాగా తెలుసు.. అందరికి నచ్చినవి తినాలని ఆయన విశ్వసిస్తే, మోదీజీ మాటలను ఎందుకు వక్రీకరిస్తున్నారు? హిందువులను అవమానిస్తున్నారు’’… అంటూ త్రిపుర మాజీ గవర్నర్ తథాగత రాయ్, బీజేపీ నేత శంకుదేవ్ పాండా సీఎం మమతా పై ఫైర్ అయ్యారు.

సీపీఎం నాయకుడు వికాస్ భట్టాచార్య మాట్లాడుతూ.. మమతా దీదీ కచ్చితంగా ప్రధానికి వంట చేయగలరు. అవమానించారా..? లేదా అనేది నాకు తెలియదు. మోడీ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఇద్దరూ మతంతో రాజకీయాలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..