Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Weather Report
Follow us

|

Updated on: Oct 10, 2022 | 7:18 AM

దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం..గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ( ఐఎండీ) అంచనా వేసింది. సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఆదివారంపిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాలలో..

ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కూడా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయిని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఇవి కూడా చదవండి

సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌,ఆసిఫాబాద్‌, నారాయణపేట, వనపర్తి, గద్వాల, ఖమ్మం, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.

ఇక ఏపీలోను రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..